Gold Prices: దీపావళికి ముందే ఊరటనిచ్చిన పసిడి ధరలు.. ఒక్కసారిగా ఢమాల్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

దేశంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలుతున్నాయి. దీపావళి పండుగల క్రమంలో దిగజారుతున్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడం, డాలర్ బలపడుతుండటంతో పసిడి ధరలు దిగొస్తున్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత పడిపోయే అవకాశముందనే అంచనాలు వెలువడుతున్నాయి. నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Prices: దీపావళికి ముందే ఊరటనిచ్చిన పసిడి ధరలు.. ఒక్కసారిగా ఢమాల్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
Gold Prices

Updated on: Nov 02, 2026 | 6:44 AM

దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీపావళి పండుగ మరికొద్ది రోజుల్లో వస్తున్న క్రమంలో ధరలు కుప్పకూలడం ఉపశమనం కల్గిస్తోంది. గత కొన్ని నెలలుగా ధరలు పతనమవుతుండగా.. గత వారం రోజులుగా మరింతగా కుప్పకూలుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగడం, అమెరికా డాలర్ బలపడటం, క్రూడ్ ఆయిల్ ధరలు స్ధిరంగా ఉండటం  లాంటి పరిణామాలు పసిడి ధరలపై ప్రభావితం చూపిస్తున్నాయి. బంగారం ధరలు మరింత పడిపోతాయనే కారణంతో చాలామంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను విక్రయిస్తున్నారు. దీంతో అమ్మకాల ఒత్తిడితో ధరలు పడిపోతున్నాయి. నవంబర్ 2వ తేదీన దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు నేడు ఇలా..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,870 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,27,290గా ట్రేడవుతోంది.

-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,870 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,27,290గా కొనసాగతోంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,020గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,27,290 వద్ద ట్రేడవుతోంది

-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,870 వద్ద కొనసాగుతోండగా..22 క్యారెట్ల రేటు రూ.1,27,290గా ట్రేడవుతోంది

-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,870 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,27,290గా ఉంది.

ఇవాల్టీ సిల్వర్ ధరలు ఇవే..

బంగారంతో పాటు వెండి  ధరలు కూడా తగ్గుతున్నాయి.

-హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,99,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.2 లక్షల వద్ద స్ధిరపడింది.

-చెన్నైలో కిలో సిల్వర్ రూ.1,99,900గా ట్రేడవుతోంది

-బెంగళూరులో కిలో వెండి రేటు రూ.1,99,900 వద్ద కొనసాగుతోంది

Loading...
Unable to load recommendations.
Follow Us