
Gold, Silver Prices: దేశంలో బంగారం, వెండి ధరలలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా పతనమవుతున్న ధరలు.. తాజాగా కూడా తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుదైదు రోజులుగా భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా నవంబర్ 16న దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
అమెరికన్ డాలర్ కదలికలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉంది. కాగా బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణాల్లో ముఖ్యంగా ముడి చమురు ధరలు తగ్గడం, అమెరికన్ డాలర్ సాపేక్షంగా స్థిరంగా ఉండటం దేశీయ బులియన్ మార్కెట్‌కు మద్దతునిచ్చాయని, ఇది బంగారం ధరల పునరుద్ధరణకు దారితీసిందని నిపుణులు పేర్కొంటున్నారు. బ్రోకరేజ్ సంస్థ లెమన్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ గార్గ్ ప్రకారం ఇటీవల అంతర్జాతీయ బంగారం ధరలు తగ్గడం దీపావళి పండుగ సీజన్‌లో బంగారం ఆభరణాల కొనుగోళ్లను ప్రోత్సహించిందని పేర్కొన్నారు.
అయితే ఇక్కడ పేర్కొన్న ధరలు సూచిక ధరలు మాత్రమే. బంగారు నగలు కొనుగోలు చేసేటప్పుడు బంగారం స్వచ్ఛత, తయారీ ఛార్జీలు, వృథా ఖర్చులు, వర్తించే పన్నులు కలిపి తుది బిల్లు మారుతుంది. అలాగే ఒక నగల దుకాణం నుంచి మరో దుకాణానికి ధరల్లో స్వల్ప తేడా ఉండొచ్చు. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఆ రోజు షాపులో ఉన్న ధరను నిర్ధారించుకోవాలి.
ఇది కూడా చదవండి: Golconda Fort Secrets: కోహినూర్ వజ్రం నుంచి కోట పతనం వరకు.. గోల్కొండ కోట చరిత్రలో దాగిన ఆసక్తికర రహస్యాలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి