Gold Rate Today: ఆల్‌టైం రికార్డు చేరువకు పసిడి పరుగులు.. రూ.91 వేలు దాటేసిన గోల్డ్! తులం ఎంత ఉందంటే..

|

Mar 19, 2025 | 8:46 AM

పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం, వెండికి మస్తు గిరాకీ ఉంటుంది. అంతగా ఇవి మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయాయి. అయితే ప్రస్తుతం మాత్రం వీటిని కొనలేని పరిస్థితి దాపురించింది. అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా బంగారం, వెండి ధరలు ఆల్‌టైం రికార్డుకు చేరుకున్నాయి. మరోవైపు రష్యా యుద్ధవిరమణకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే పుత్తడి ధరలు దిగిరావడం ఖాయం..

Gold Rate Today: ఆల్‌టైం రికార్డు చేరువకు పసిడి పరుగులు.. రూ.91 వేలు దాటేసిన గోల్డ్! తులం ఎంత ఉందంటే..
Gold And Silver Price
Follow us on

హైదరాబాద్, మార్చి 19: బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఆల్‌టైం రికార్డుకు చేరుకున్నాయి. ఎన్నడూ కనీవినని రీతిలో రోజురోజుకూ పైపైకి ధరలు ఎగబాకుతున్నాయి. అయితే నేటి ధరలు స్వల్పంగా పెరిగింది. మంగళవారంతో పోల్చితే ఈ రోజుకి స్వల్పంగా పెరిగింది. బుధవారం (మార్చి 19) ధరల విషయానికొస్తే.. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.91,010 పలికింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.82,510కు చేరుకుంది. 18 క్యారెట్లు తులం రూ.67,510కు పెరిగింది. ఇక కిలో వెండి ధర వంద రూపాయలు పుంజుకుని రూ.1,04,100కు చేరుకుంది. వెండి గ్రాము ధర రూ.104.10 పలుకుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర తులంకి నేడు రూ.10 పైకి ఎగబాకింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము రూ.9001, 22 క్యారెట్ల బంగారం 8,251 వద్ద, 18 క్యారెట్ల బంగారం రూ.6,751 వద్ద ధరలు కొనసాగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.90,010, 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.82,510, 18 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.67,510కు పెరిగాయి.

ఇవి కూడా చదవండి

గుంటూరులో 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.90,010, 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.82,510, 18 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.67,510కు పెరిగాయి.. ఇవే ధరలు కాకినాడ, నెల్లూరులో కూడా కొనసాగుతున్నాయి.

దేశంలో ప్రదాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

  • చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.9,001, 22 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.8,251, 18 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.6,811
  • ముంబైలో 24 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.9,001, 22 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.8,251, 18 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.6,751
  • ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.9,016, 22 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.8,266, 18 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.6,763
  • కలకత్తాలో 24 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.9,001, 22 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.8,251, 18 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.6,751
  • బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.9,001, 22 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.8,251, 18 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.6,751
  • కేరళలో 24 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.9,001, 22 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.8,251, 18 క్యారెట్ల గోల్డ్‌ గ్రాము రూ.6,751

ఇక వెండి ధరలు దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఒకేలా ఉన్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,13,100, చెన్నైలో రూ.1,13,100, ముంబైలో రూ.1,04,100, ఢిల్లీలో రూ.1,04,100, బెంగళూరులో రూ.1,04,100 వద్ద కొనసాగుతుంది.

నోట్: ఈ ధరలు జీఎస్టీ, తరుగు కలపకుండా ఇచ్చినవి మాత్రమే. వీటిని చేర్చితే ధరల్లో మార్పులు వస్తాయి. గమనించగలరు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.