Gold and Silver Price Today: పసిడి ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. అదే బాటలో వెండి

బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు దేశీయ అంతర్జాతీయ పరిణామాల మధ్య హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. ఒకానొక టైమ్ లో ఆల్ టైం హైకి చేరుకున్న బంగారం ధర మళ్ళీ స్వల్పంగా తగ్గుతుంది. ధరలు రోజు రోజుకీ మారుతున్నాయి. దీంతో పసిడి కొనుగోలుదారుల మనసులో గందరగోళం నెలకొంటుంది. ఈ నేపధ్యంలో మా విలువైన పాఠకుల కోసం తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ రోజు పసిడి వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలియజేస్తున్నాం. ఈ విలువైన సమాచారం మీకు ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాం..

Gold and Silver Price Today: పసిడి ప్రియులకు ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. అదే బాటలో వెండి
Gold And Silver Price

Updated on: May 12, 2025 | 6:52 AM

భారతీయులకు బంగారానికి అవినావ భావ సంబంధం ఉంది. పూర్వకాలం నుంచి పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు వంటి ప్రత్యేక రోజుల్లోనే కాదు.. ఏ చిన్న సందర్భం వచ్చినా సరే ముందుగా గుర్తుకొచ్చేది బంగారమే. డబ్బులు ఎప్పుడు చేతిలో ఉన్నా బంగారం కొనాలని కోరుకుంటారు. అంతగా పసిడి మన జీవితాలతో ముడిపడిపోయింది. అయితే పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా మరుతూ ఉంటాయి. మన దేశంలో బంగారం, వెండి ధరలు కూడా అంతర్జాతీయ పరిస్థితులపై మాత్రమే కాదు ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, వడ్డీ రేట్లలో ఆధారపడి ఉంటాయి. బంగారం హోదా తెలియజేసేందుకు ఒక చిహ్నంగా భావించడమే కాదు.. ప్రస్తుతం మంచి పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పసిడికి, వెండి భారీ డిమాండ్ నెలకొంది. దీంతో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరుకుంటారు.ఈ నేపధ్యంలో ఈ రోజు (12 మే , 2025) విలువైన బంగారం, వెండి ధరలు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లో మే 12 వ తేదీ పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే…

హైదరాబాద్ లో బంగారం ధర స్వల్పంగా దిగి వచ్చింది. దీంతో ఈ రోజు పూర్ గోల్డ్ ( 24 క్యారెట్ల)10 గ్రాముల బంగారం ధర రూ. 98,670లు ఉండగా… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,440గా కొనసాగుతోంది.

ఇవే ధరలు తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, పొద్దుటూరు, వరంగల్ లలో కొనసాగుతున్నాయి.

నేడు దేశంలో ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ప్యూర్ గోల్డ్ ధర 24 క్యారెట్ల ధర రూ. 98,820లగా కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,590లుగా ఉంది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ.90,440 వద్ద ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 98,670 వద్ద కొనసాగుతోంది. ఇవే ధరలు దేశంలో ప్రధాన నగరాలైన చెన్నై, కోల్ కతా, కేరళ , బెంగళూరు, పూణే వంటి ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నాయి.

నేటి వెండి ధర

బంగారం తర్వాత విలువైన లోహంగా ప్రసిద్ధిచెందింది వెండి. దీనిని ఆభరణాలు, నాణేలు, వంటపాత్రల తయారీ కోసం ఉపయోగిస్తారు. అంతేకాదు బంగారం తర్వాత భారతీయులు అత్యధికంగా కొనే లోహం వెండి. వివాహం, ఫంక్షన్ ఇలా ఏ శుభ సందర్భం వచ్చినా బంగారం తర్వాత వెండికే ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. అయితే భారతదేశంలో వెండి ధర అంతర్జాతీయ ధరల ద్వారా నిర్ణయించబడుతుంది. అవి రెండు వైపులా కదులుతాయి. అంతేకాదు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతే.. అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉంటే, వెండి మరింత ఖరీదైనదిగా మారుతుంది. దీంతో వెండి కొనేముందు ఈ రోజు బహిరంగ మార్కెట్ ధ‌రలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలని భావిస్తారు. ఈ రోజు వెండి బంగారం బాటలో నడుస్తూ కొంత మేర దిగి వచ్చింది. కిలో సుమారు వంద రూపాయలు తగ్గింపు నమోదు చేసుకుంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండికి వంద రూపాయలు మేర దిగి వచ్చి ఈ రోజు 1,10,900లు గా కొనసాగుతోంది. అయితే దేశంలో ప్రధాన నగరాలైన ధిల్లీ, ముంబై, బెంగుళూరు, కోల్ కతా వంటి నగరాల్లో కిలో వెండి ధర ఈ రోజు రూ. 98,900లు గా కొనగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..