Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. రికార్డ్ స్థాయిలో వెండి!

Gold Price Today: దేశంలో బంగారం అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా మహిళలు బంగారానికి ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమాలలో బంగారం కొనేందుకు ఇష్టపడుతుంటారు. అయితే బంగారం ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి. సామాన్యులు సైతం గ్రాము బంగారం కొనాలంటే భయపడే..

Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం ధరలు.. రికార్డ్ స్థాయిలో వెండి!

Updated on: Dec 15, 2025 | 6:51 AM

Gold Price Today: దేశంలో బంగారం అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా మహిళలు బంగారానికి ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమాలలో బంగారం కొనేందుకు ఇష్టపడుతుంటారు. అయితే బంగారం ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి. సామాన్యులు సైతం గ్రాము బంగారం కొనాలంటే భయపడే రోజులు వచ్చేశాయి. గడిచిన వారం రోజుల్లో తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు చాలా మారిపోయాయి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే లక్షా 35 వేల వరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దేశీయంగా తులం బంగారం ధర రూ.1,33,900 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,900 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,740 ఉంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,900 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,740 ఉంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,060 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,890 ఉంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,900 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,740 ఉంది.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,900 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,740 ఉంది.
  6. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,940 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,23,690 ఉంది.
  7. ఇక కిలో వెండి ధర రూ.1,97,900 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us