Gold Prices: బంగారం ధరలపై ఊరట.. ఒక్కసారిగా మారిన ధరలు.. ఇవాల్టీ రేట్లు ఇలా..

బంగారం, వెండి ధరలు ఊరటనిచ్చాయి. నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గముఖం పట్టాయి. దీంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. బుధవారం ఒకేసారి తులం బంగారంపై రూ.6 వేలు పెరగ్గా.. నేడు రిలీఫ్ ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Gold Prices: బంగారం ధరలపై ఊరట.. ఒక్కసారిగా మారిన ధరలు.. ఇవాల్టీ రేట్లు ఇలా..
Gold And Silver

Updated on: Jan 22, 2026 | 6:33 AM

అంతర్జాతీయ పరిణామాల కారణంగా బంగారం, వెండి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సోమవారం నుంచి ధరలు అసలు తగ్గనే తగ్గడం లేదు. బుధవారం ఒక్కసారిగా రూ.6 వేల మేర పెరిగి షాకిచ్చింది. నిన్నటితో పోలిస్తే గురువారం కాస్త స్వల్పంగా తగ్గడంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. అటు బంగారంతో పాటు వెండి ధర కూడా ఆమాంతంగా పెరుగుదల నమోదు చేస్తోంది. గురువారం వివిధ ప్రాంతాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు ప్రాంతాల వారీగా..

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,610 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ ధర రూ.1,56,600 వద్ద స్ధిరపడింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు ప్రస్తుతం రూ.1,43,560 వద్ద కొనసాగుతోంది. దీని ధర నిన్న రూ.1,43,550గా ఉంది.

-విజయవాడ, విశాఖపట్నంలో ఇప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రూ.1,56,610 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,43,560గా ఉంది.

-చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,57,270 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ ధర రూ.1,57,260గా ఉంది. అటు 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,160 వద్ద కొనసాగుతోండగా.. బుధవారం దీని ధర రూ.1,44,150గా ఉంది.

-బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ రేటు రూ.1,56,610 వద్ద కొనసాగుతోంది. బుధవారం దీని ధర రూ.1,56,600 వద్ద స్ధిరపడింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,4
3,560 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,43,550 వద్ద స్థిరపడింది.

-ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,56,760 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,43,710గా ఉంది

వెండి ధరలు ఇవే..

-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.3,30,100 వద్ద కొనసాగుతోంది. బుధవారం రూ.3,30,000 వద్ద స్థిరపడింది

-హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.3,45,100గా ఉంది. నిన్న రూ.3,45,000 వద్ద స్ధిరపడింది

-చెన్నైలో కేజీ వెండి ధర రూ.3,45,100గా ఉండగా.. బెంగళూరులో రూ.3,30,100 వద్ద కొనసాగుతోంది