రూ.20,000 పెట్టుబడితో రూ.20 లక్షలు పొందండి.. ఎలాగో తెలుసుకోవడానికి క్లిక్ చేయండి..

|

May 03, 2023 | 7:30 PM

SIP Investments: మ్యూచువల్ ఫండ్స్‌లో నెలవారీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) ప్రారంభించడం దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మంచి మార్గంగా పరిగణించవచ్చని మార్కెట్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఎస్ఐపీ సహాయంతో, మీరు నెలవారీ, వార, ద్వైమాసిక, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన నిర్ణీత మొత్తంతో క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి పెట్టవచ్చు.

రూ.20,000 పెట్టుబడితో రూ.20 లక్షలు పొందండి.. ఎలాగో తెలుసుకోవడానికి క్లిక్ చేయండి..
Sukanya Samriddhi Yojana
Image Credit source: TV9 Telugu
Follow us on

సాధారణంగా కష్టపడి సంపాదించిన సొమ్ముకు నమ్మకమైన రాబడి కోసం వివిధ పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటాం. ముఖ్యంగా తక్కువ సొమ్ము పెట్టుబడితో అధిక లాభాల కోసం సగటు పెట్టుబడిదారులు అన్వేషిస్తూ ఉంటారు. ముఖ్యంగా భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకుని పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ముందుకొస్తూ ఉంటుారు. ఇలాంటి వారు మ్యూచువల్ ఫండ్స్‌లో నెలవారీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) ప్రారంభించడం దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మంచి మార్గంగా పరిగణించవచ్చని మార్కెట్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఎస్ఐపీ సహాయంతో, మీరు నెలవారీ, వార, ద్వైమాసిక, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన నిర్ణీత మొత్తంతో క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి పెట్టవచ్చు. మీ నెలవారీ ఎస్ఐపీ పెట్టుబడి నుంచి 12 శాతం వార్షిక రాబడిని పొందడం ద్వారా రూ. 20 లక్షలు పొందడానికి ఎంత సమయం పడుతుందో ఓ సారి చూద్దాం. ముఖ్యంగా గత దశాబ్ధ కాలం నుంచి అనేక మ్యూచువల్ ఫండ్‌లు 12 శాతం కంటే ఎక్కువ వార్షిక రాబడిని అందించాయి. అయితే, పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాల ప్రకారం తమకు అనువైన ఉత్తమమైన ఫండ్‌ను కనుగొనడానికి ఎల్లప్పుడూ వారి ఆర్థిక ప్రణాళికదారులను సంప్రదించడం ఉత్తమం. ముఖ్యంగా నెలవారీ ఎంత పెట్టుబడి పెడితే ఎంత కాలంలో రూ.20 లక్షలు సొమ్ముకు చేరుకుంటామో? ఓ సారి తెలుసుకుందాం.

  • రూ. 10,000 ఎస్ఐపీ: నెలవారీ రూ. 10,000 ఎస్ఐపీ 12 శాతం సీఏజీఆర్‌తో 9 సంవత్సరాల 2 నెలల్లో రూ. 20 లక్షలకు చేరుకుంటుంది. 
  • రూ. 20,000 ఎస్ఐపీ: రూ. 20,000 నెలవారీ ఎస్ఐపీ 12 శాతం సీఏజీఆర్‌తో 5 సంవత్సరాల 10 నెలల్లో రూ. 20 లక్షలకు చేరుకోవడంలో మీకు సహాయం చేస్తుంది.
  • రూ. 25,000 ఎస్ఐపీ: రూ. 25,000 నెలవారీ ఎస్ఐపీ 12 శాతం సీఏజీఆర్‌తో 4 సంవత్సరాల 11 నెలల్లో రూ. 20 లక్షలకు చేరుకుంటుంది.
  • రూ. 30,000 ఎస్ఐపీ: నెలవారీ రూ. 30,000 ఎస్ఐపీ 12శాతం సీఏజీఆర్‌తో 4 సంవత్సరాల 3 నెలల్లో రూ. 20 లక్షలకు చేరుకోవడంలో మీకు సహాయం చేస్తుంది.
  • రూ. 40,000 ఎస్ఐపీ: నెలవారీ రూ. 40,000 ఎస్ఐపీ 12శాతం సీఏజీఆర్‌తో 3 సంవత్సరాల 5 నెలల్లో రూ. 20 లక్షలకు చేరుకుంటుంది.
  • రూ. 50,000 ఎస్ఐపీ : రూ. 50,000 నెలవారీ ఎస్ఐపీ 12 శాతం సీఏజీఆర్‌తో 2 సంవత్సరాల 10 నెలల్లో రూ. 20 లక్షలకు చేరుకోవడంలో మీకు సహాయం చేస్తుంది.
  • రూ. 75,000 ఎస్ఐపీ: రూ. 75,000 నెలవారీ ఎస్ఐపీ 12 శాతం సీఏజీఆర్‌తో 2 సంవత్సరాలలో రూ. 20 లక్షలకు చేరుకుంటుంది.
  • రూ. 1 లక్ష ఎస్ఐపీ: నెలవారీ రూ. 1 లక్ష ఎస్ఐపీ 12 శాతం సీఏజీఆర్‌తో కేవలం 1 సంవత్సరం ఏడు నెలల్లో రూ. 20 లక్షలకు చేరుకుంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..