PAN Card: నిమిషాల్లోనే ఈ-పాన్‌ కార్డు పొందండి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు

|

Aug 18, 2021 | 8:06 AM

PAN Card: ప్రస్తుతం అన్ని డాక్యుమెంట్లలో ప్రధానమైనది పాన్‌కార్డు. ఇది బ్యాంకింగ్‌కు సంబంధించిన పనులలో, ఇతర వాటిలో తప్పనిసరిగా అవసరం అవుతుంది. గతంలో పాన్‌కార్డు గురించి..

PAN Card: నిమిషాల్లోనే ఈ-పాన్‌ కార్డు పొందండి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు
Pan Card
Follow us on

PAN Card: ప్రస్తుతం అన్ని డాక్యుమెంట్లలో ప్రధానమైనది పాన్‌కార్డు. ఇది బ్యాంకింగ్‌కు సంబంధించిన పనులలో, ఇతర వాటిలో తప్పనిసరిగా అవసరం అవుతుంది. గతంలో పాన్‌కార్డు గురించి పెద్దగా పట్టించుకోకపోయినా.. ప్రస్తుతం చాలా అవసరం అవుతోంది. గతంలో పాన్‌ కార్డు కావాలంటే కనీసం 45 రోజుల సమయం పట్టేది. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో వారం రోజుల్లోనే ఇంటికి చేరుతుంది. కానీ ఈ-పాన్‌ కార్డు కావాలంటే నిమిషాల్లో పొందే అవకాశం ఉంది. ఈ పాన్‌ కార్డు లేనిది ప్రభుత్వానికి సంబంధించి, బ్యాంకులకు సంబంధించి పనులలో తప్పనిసరి అయిపోయింది. ఈ పాన్‌ కార్డు లేకుండా బ్యాంకింగ్‌ రంగంలో ఎలాంటి ఆర్థిక, బ్యాంకు పనుల నిమిత్తం పనులు చేసుకోవాలంటే కుదరని పని. మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పాన్‌ ధృవీకరణ ఇప్పుడు ఆన్‌లైన్‌లో సులభతరంగా చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. అయితే ఆన్‌లైన్‌లో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఈ ప్రక్రియను నిమిషాల్లోనే పూర్తి చేసి కార్డు పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో ఈ-పాన్‌ కార్డు దరఖాస్తు ఎలా..?

మీరు ముందుగా ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ www.incometax.gov.in ని ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. ఇది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇ-ఫైలింగ్ పోర్టల్. ఇందులో ఇన్‌స్టంట్ పాన్ కార్డును ఎంచుకోవాలి. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఎడమవైపు Quick Links కనిపిస్తుంది. అందులో Instant PAN through Aadhaar అనే లింక్‌పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీలో అందులో Get New PAN పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Generate Aadhaa OTP పైన క్లిక్ చేయాలి.

మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నమోదు చేసిన తర్వాత మీ ఆధార్ వివరాలు ఓసారి చెక్ చేసుకోవాలి. మీ ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. చివరగా సబ్మిట్ చేసిన తర్వాత 15 అంకెల అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పాన్ కార్డు జారీ అవుతుంది.

అయితే ఆదాయపు పన్ను శాఖ యూఐడీఏఐ దగ్గర రిజిస్టర్ అయిన మీ ఆధార్ వివరాల ద్వారా పాన్ కార్డు జారీ చేస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం కేవలం 10 నిమిషాల్లో పూర్తవుతుంది. తర్వాత Check Status/ Download PAN పైన క్లిక్ చేసి మీ ఇ-పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ ఇ-పాన్ కార్డు పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీ ఇమెయిల్ ఐడీకి వస్తుంది. ఇన్‌స్టంట్ పాన్ కార్డును మీరు ఒరిజినల్ పాన్ కార్డులాగానే ఉపయోగించుకోవచ్చు. ఆర్థిక లావాదేవీలతో పాటు ఐడీ ప్రూఫ్‌గా చూపించవచ్చు.

ఇలా కేవలం పది నిమిషాల్లోనే పాన్‌కార్డు పొందే వెసులుబాటు ఉంది. అయితే పాన్‌కార్డు ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోవడంతో పాన్‌ కార్డు లేనివారు ఎంతో ఇబ్బంది పడేది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఇటీవల కాలంలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇవీ కూడా చదవండి:  SBI: ఎస్‌బీఐ పండగ ఆఫర్లు.. రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజు మినహాయింపు.. యోనో యాప్‌ ద్వారా దరఖాస్తుకు అదనపు రాయితీలు

LPG: ఎల్‌పీజీ గ్యాస్‌ ఏజెన్సీ పొందడం ఎలా?.. గ్యాస్‌ సిలిండర్‌ డీలప్‌షిప్‌ కావాలంటే ఏం చేయాలి.. పూర్తి వివరాలు