Generic Aadhaar: జనరిక్‌ ఆధార్‌ ఫ్రాంచైజీని ప్రారంభించండి.. అధిక లాభాలు పొందండి..!

| Edited By: Subhash Goud

Jul 20, 2021 | 1:59 PM

Generic Aadhaar Medicine : ఔషధ స్టార్టప్ కంపెనీ జనరిక్ ఆధార్ అందుబాటు ఉన్న విషయం తెలసిందే. దీనిపై ఇటీవల నుంచి తరచుగా వినిపిస్తోంది. ఆన్‌లైన్ ఫార్మసీలో పోటీని..

Generic Aadhaar: జనరిక్‌ ఆధార్‌ ఫ్రాంచైజీని ప్రారంభించండి.. అధిక లాభాలు పొందండి..!
Generic Aadhaar
Follow us on

Generic Aadhaar Medicine : ఔషధ స్టార్టప్ కంపెనీ జనరిక్ ఆధార్ అందుబాటు ఉన్న విషయం తెలసిందే. దీనిపై ఇటీవల నుంచి తరచుగా వినిపిస్తోంది. ఆన్‌లైన్ ఫార్మసీలో పోటీని అధిగమించేందుకు దీన్ని ప్రారంభించారు. సంబంధిత మందులు సమీప జనరిక్ ఆధార్ ఫ్రాంచైజీ స్టోర్ నుంచి పంపిణీ చేయనున్నారు. ప్రజలు చేరువ కావడానికి జనరిక్ ఆధార్ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే, దేశీయంగా ప్రజల ఆరోగ్య సంరక్షణ సామర్థ్యాన్ని పెంపోందించేందుకు ఇది తోడ్పాటునందిస్తుంది. ప్రజలకు సరసమైన ధరలకే నాణ్యమైన మందులు లభించనున్నాయి. ఇతర ఔషధ సంస్థల ఫ్రాంచైజీలలో మీకు 15 నుంచి 20 శాతం వరకు మార్జిన్‌ లభిస్తుంది. సాధారణ ఈ మందులు తక్కువ ధరను కలిగి ఉంటాయి. సంస్థ సాంకేతిక సహకారంతో స్థానిక ఆన్‌లైన్‌ ఆర్డరింగ్‌ సౌకర్యాలను కూడా అందిస్తుంది. ప్రస్తుతం జెనెరిక్‌ ఆధార్‌ సుమారు 700 రకాల ఔషధాలు విక్రయిస్తుంది.

కంపెనీ ఫ్రాంచైజీని ఎలా ప్రారంభించాలి..?

మీరు జనరిక్‌ ఆధార్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీకు బిజినెస్‌కు సంబంధించి ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే ఫ్రాంచైజీ తీసుకునేందుకు ఫారం లభిస్తుంది. ఇక్కడ మీరు మీ పూర్తి పేరు, ఫోన్‌ నెంబర్‌,చిరునామ, నగరం పేరు, ఈ-మెయిల్‌ ఐడీ తదితర వివరాలు పూరించాల్సి ఉంటుంది. భారత దేశంలో30 వేల రిటైల్‌ అవుట్లెట్లు ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి నగరంలో 100 దుకాణాలను కలిగి ఉండాలని కంపెనీ భావిస్తోంది. జనరిక్‌ ఆధార్‌ దుకాణాల్లో సుమారు 1000 మందులు అమ్ముడవుతున్నాయి. దీని ద్వారా దేశంలోని సామాన్యులకు సరసమైన ధరలకు లభిస్తాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో జనరిక్‌ ఆధార్‌ ఫ్రాంచైజీలు ప్రారంభించబడ్డాయి. అయితే ఔషధ స్టార్టప్ కంపెనీ జనరిక్ ఆధార్ యాప్‌ను మార్చిలో రతన్ టాటా విడుదల చేశారు. ఈ యాప్‌లో మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లను అప్‌లోడ్ చేసేందుకు, ఆర్డర్లను ఇచ్చే సదుపాయాలు ఉన్నాయి. ఆన్‌లైన్ ఫార్మసీలో పోటీని అధిగమించేందుకు దీన్ని ప్రారంభించారు. సంబంధిత మందులు సమీప జనరిక్ ఆధార్ ఫ్రాంచైజీ స్టోర్ నుంచి పంపిణీ చేయనున్నారు. ‘ప్రజలు చేరువ కావడానికి జనరిక్ ఆధార్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

ఇవీ కూడా చదవండి:

Home Loan EMI: మీరు గృహ రుణం తీసుకుంటున్నారా..? అయితే ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవడం ఎలా..?

SBI Special FD Scheme: ఎస్‌బీఐలో ఈ స్కీమ్‌లో చేరేందుకు గడువు పెంపు.. వడ్డీ రేటు 6.2 శాతం