
Friday Bank Holiday: జనవరిలో బ్యాంకులు చాలా రోజులు మూసి ఉండనున్నాయి. ఈ బ్యాంకు సెలవులు వివిధ నగరాల్లో వివిధ కారణాల వల్ల మూసి ఉంటాయని గుర్తించుకోండి. మీరు రాబోయే రోజుల్లో బ్యాంకు పని నిమిత్తం వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే ముందస్తుగానే మీ నగరంలోని బ్యాంకు సెలవుల గురించి తెలుసుకోవాలి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకు సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేస్తుంది. ఏయే నగరాల్లో ఏయే బ్యాంకులు ఏయే రోజుల్లో మూసి ఉంటాయి. ఏ కారణాల వల్ల మూసి ఉంటాయో అనే వివరాలు ఇందులో ఉన్నాయి. అందువల్ల ఏదైనా రోజున బ్యాంకును సందర్శించే ముందు, RBI బ్యాంకు సెలవుల జాబితాను తనిఖీ చేసి వెళ్లడం ముఖ్యం. ఇప్పుడు జనవరి 16న బ్యాంకులు కూడా మూసి ఉంటాయి. అయితే సెలవు కేవలం తమిళనాడు రాష్ట్రంలోనే. మిగతా రాష్ట్రాలలో బ్యాంకులు తెరిచే ఉంటాయని గుర్తించుకోండి.
ఇది కూడా చదవండి: Post Office Scheme: కేవలం రోజుకు రూ.200తోనే రూ.10 లక్షలు సృష్టించవచ్చు.. ఎలాగో తెలుసా?
జనవరి 16 బ్యాంకు సెలవు
ఆర్‌బిఐ దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో 15న మూసి ఉన్నాయి. జనవరి 16న బ్యాంకులకు సెలవు ప్రకటించింది. తిరువళ్ళువర్ దినోత్సవం కారణంగా తమిళనాడులో రేపు బ్యాంకులకు సెలవు ప్రకటించినట్లు ఆర్‌బిఐ ప్రకటించింది. తమిళ సాధువు-కవి తిరువళ్ళువర్ గౌరవార్థం తిరువళ్ళువర్ దినోత్సవం జరుపుకుంటారు.
ఇది కూడా చదవండి: Post Office: పోస్టాఫీసులో రూ.1 లక్ష డిపాజిట్ చేస్తే రూ.44,995 స్థిర వడ్డీ!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి