ప్రస్తుతం ఏదో ఒక వ్యాపారం చేయాలనే ఆలోచన చాలా మందిలో పెరుగుతోంది. ఉన్న ఊరిలోనే ఉంటూ ఆదాయా మార్గాలను అన్వేషిస్తున్నారు. ఉద్యోగం చేసే వారు కూడా సైడ్ ఇన్‌కమ్ కోసం వ్యాపారాలను మొదలు పెడుతున్నారు. అయితే సాధారణంగా వ్యాపారం అనగానే భారీగా పెట్టుబడులు అవసరం ఉంటుందనే బావనలో ఉంటాం. అయితే వినూత్నంగా ఆలోచిస్తే తక్కువ ఖర్చులో కూడా మంచి వ్యాపారాలను ప్రారంభించవచ్చు. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం..
ఫ్రెంచ్ ఫ్రైస్ అనగానే పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌లో లభించేవి అనుకుంటాం. అయితే ఫ్రెంచ్ ఫ్రైట్ స్టాల్ ఏర్పాటు చేయడం ద్వారా చిన్న చిన్న పట్టణాల్లో కూడా మీ వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. ఇందుకోసం మంచి లొకేషన్‌లో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు చాలా తక్కువ పెట్టుబడి అవుతుంది. ఈ వ్యాపారన్ని ప్రారంభించాలంటే ఫ్రెంచ్ ఫ్రై మిషన్ కావాల్సి ఉంటుంది. వీటితో పాటు పొటాటో ఫింగ్ చిప్స్, చాట్ మసాలా, నూనె వంటి ముడిసరుకులు కావాల్సి ఉంటుంది.
మార్కెట్లో పొటాటో ఫింగర్ చిప్స్ ధర.. 2.5 కిలోల ప్యాకెట్ రూ. 270 నుంచి రూ. 300 వరకు లభిస్తాయి. అయితే పొటాటో చిప్స్‌ను స్వయంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇక చిప్స్ తయారీ విషయానికొస్తే.. ఫ్రెంచ్ ఫ్రైస్ మిషిన్‌లో ఆయిల్ వేసి చిప్స్‌ను వేయించడమే. ఈ మిషిన్ ధర రూ. 3500 నుంచి ప్రారంభమవుతుంది. స్టాల్ ఏర్పాటుకు రూ. 5000 వరకు అవుతుంది.
అయితే స్టీల్ స్టాల్ కావాలంటే కాస్త ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. చివరిగా ఫ్రెంచ్ ఫ్రైస్‌ను సర్వ్ చేయడానికి ప్యాకెట్స్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్‌పై చల్లేందుకు మసాలాలను కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటిని మీ సొంత బ్రాండింగ్‌తో కూడా విక్రయించుకోవచ్చు. మొత్తం మీద ఈ బిజినెస్‌ను రూ. 20 నుంచి రూ. 30వేలలో ప్రారంభించవచ్చు.
లాభాల విషయానికొస్తే.. సాధారణంగా ఒక కప్పు ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీకి రూ. 20 ఖర్చు అవుతుంది. అయితే తక్కువలో తక్కువ ఒక్క ప్యాకెట్‌ను రూ. 50 విక్రయించిన రూ. 30 లాభం ఏటు పోవు. తక్కువలో తక్కువ రోజుకు ఒక 50 ప్యాకెట్స్ విక్రయించినా రూ. 1500 లాభం వస్తుంది. ఇలా నెలంతా నడిస్తే కనీసం రూ. 40 వేలు ఆర్జించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..