
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడతాయి. వీటి ద్వారా పేదలు ఆర్థికాభ్యున్నతి సాధించడం, వారి కుటుంబ పరిస్థితి బాగుపడడం, తద్వారా సమాజం కూడా ప్రగతి పథంలో పయనించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపర్చడమే పథకాల ప్రధాన లక్ష్యం. తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ప్రజల కోసం గృహజ్యోతి అనే పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా అర్హత కలిగిన కుటుంబాలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ ను అందిస్తున్నారు. ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. దీనికి గల అర్హతలు, దరఖాస్తు చేసుకునే విధానం తదితర వివరాలు తెలుసుకుందాం.
గృహజ్యోతి పథకం కింద తెలంగాణలోని అన్ని అర్హత కలిగిన కుటుంబాలు గృహావసరాల కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను పొందవచ్చు. ఈ పరిమితి దాటితే చార్జీలు వసూలు చేస్తారు. నెలవారీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే తక్కువగా ఉన్నవారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. గృహజ్యోతి పథకంలో పేద కుటుంబాలు 200 యూనిట్ల వరకూ విద్యుత్ ను ఉచితంగా పొందవచ్చు.
తెల్ల రేషన్ కార్డు, తక్కువ విద్యుత్ ను వినియోగించే కుటుంబాలు ఉచితంగా విద్యుత్ పొందవచ్చు. అయితే వీరు 200 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగిస్తే, అదనపు యూనిట్లకు సాధారణ విద్యుత్ బిల్లు రేటును చెల్లించాలి.
ఇంటి యజమానులు కాకుండా అద్దెకు ఉంటున్న వారు సైతం ఈ స్కీమ్ కు అర్హులే. అద్దెదారులు తమ యజమాని పేరు మీద మీటర్ ఉందని నిరూపించడానికి పత్రాలను అందించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..