
మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా..? అయిదే ఇది మీకు మంచి అవకాశం. దీపావళి పండుగ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైన ప్రత్యేక సేల్‌లో అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీలను అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అద్భుత అవకాశం లభిస్తోంది. థామ్సన్ తన స్మార్ట్ టీవీల ధరలను బాగా తగ్గించింది. థామ్సన్ టీవీలు కేవలం రూ. 5,499 నుంచే మొదలవుతున్నాయి. చిన్న 24 ఇంచెస్ టీవీ నుంచి పెద్ద 75 ఇంచెస్ టీవీ వరకు అన్నీ తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి.
థామ్సన్ 24 ఇంచెస్ స్క్రీన్ సైజు గల స్మార్ట్ టీవీని కేవలం రూ. 5,499కే కొనుగోలు చేయవచ్చు. అదే థామ్సన్ మరో మోడల్ రూ. 5,999 కి లభిస్తుంది. ఇకపై 32 ఇంచెస్ స్మార్ట్ టీవీని రూ. 6,999 ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు.
పెద్ద సైజు టీవీలు కావాలంటే, వాటి ధరలు కూడా చాలా తగ్గాయి:
40 ఇంచెస్ LED స్మార్ట్ టీవీ: రూ. 12,499 నుంచి
43 ఇంచెస్ 4K స్మార్ట్ టీవీ: రూ. 13,499 నుంచి
50 ఇంచెస్ 4K స్మార్ట్ టీవీ: రూ. 22,199 నుంచి
65 ఇంచెస్ స్మార్ట్ టీవీ: రూ. 38,999 నుంచి
అంతేకాకుండా క్వాంటం ఎల్‌డీ టీవీ సిరీస్‌లో పెద్ద టీవీలు కూడా ధర తగ్గాయి. 65 ఇంచెస్ మోడల్ రూ. 57,999 కు, 75 ఇంచెస్ మోడల్ రూ. 84,999కే అందుబాటులో ఉన్నాయి.
కంపెనీ యొక్క ఆల్ఫా, AQI, RT సిరీస్ స్మార్ట్ టీవీలు ఈ సేల్‌లో అత్యంత సరసమైన ధరలకు లభిస్తున్నాయి. అదనంగా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న బ్యాంక్ డిస్కౌంట్లు కూడా వినియోగదారులకు మరింత ఆదా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
జీఎస్టీ తగ్గింపు తర్వాత తమ స్మార్ట్ టీవీల ధరలను వేల రూపాయలు తగ్గించినట్లు థామ్సన్ తెలిపింది. మొత్తం మీద దీపావళి సందర్భంగా కొత్త స్మార్ట్ టీవీని ఇంటికి తెచ్చుకోవాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ సేల్ ఒక గొప్ప పండగ ఆఫర్‌ను అందిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..