Petrol: పెట్రోల్, డీజిల్‌తో పని లేదు.. మార్కెట్లోకి కొత్త ఫ్యూయల్.. స్పెషాలిటీ అదిరిపొద్ది..

పెట్రోల్, డీజిల్‌నే కాదు.. త్వరలో కొత్త ఇంధన రాబోతుంది. అదే ఫ్లెక్సీ ప్యూయల్. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఇంధనం త్వరలో మార్కెట్లోకి రానుంది. ఈ ఇంధనంతో నడిచే వాహనాలను కూడా కంపెనీలు మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అసలు ఫ్లెక్సీ ప్యూయల్ అంటే ఏంటి?

Petrol: పెట్రోల్, డీజిల్‌తో పని లేదు.. మార్కెట్లోకి కొత్త ఫ్యూయల్.. స్పెషాలిటీ అదిరిపొద్ది..
Flex Fuel

Updated on: Jun 01, 2026 | 9:18 PM

దేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలను ప్రోత్సహించేందుకు భారీగా ప్రోత్సహాకాలు అందిస్తోండగా.. అలాగే ఈవీ వాహనాల కొనుగోళ్లను పెంచేందుకు కొనుగోలు చేసేవారికి సబ్సిడీలు, రాయితీలు కల్పిస్తోంది. దీంతో ఈవీ వెహికల్స్ కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ముందుకొస్తున్నారు. తక్కువ ధరకు కూడా అందుబాటులోకి వస్తుండటంతో ఇటీవల ఈవీ వెహికల్స్‌ను ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు. అయితే కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ అంటే ఏంటి..?

వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రం కొత్త సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. అందులో భాగంగా ఫ్లెక్స్ ప్యూయల్ అనే కొత్త ఇంధనాన్ని అందుబాటులోకి తెస్తోంది. ఈ సాంకేతిక ఇంధాన్ని ఫ్లెక్సిబుల్ ప్యూయల్‌గా కూడా పిలుస్తున్నారు. పెట్రోల్, ఇథనాల్, మిథనాల్ కలిపిన ఇంధనంతో దీనిని తయారుచేస్తారు. ఈ ఇంధనలో 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ ఈ85, ఇతర మిశ్రమాలను కలుపుతారు. ఈ ఇంధనంతో నడిచే వెహికల్స్‌లో ప్రత్యేకంగా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లు అనేవి ఉంటాయి. ఈ వాహనాల్లో ఒకటి కంటే ఎక్కువ ఇంధనాలను వాడవచ్చు. ఒకే ట్యాంకులోనే వేర్వేరు మిశ్రమాలను పోసుకోవచ్చు. ఇందులో ఉండే సెన్సార్లు ఇంధాన్ని గుర్తించి ఇంజిన్ పనితీరుకు తగ్గట్లు ఆటోమేటిక్‌గా ఇంధనాన్ని వాడుకుంటాయి.

కేంద్రం కీలక సూచన

ఈ ఇంజిన్‌తో నడిచే వాహనాలను కంపెనీలు మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇలాంటి తరహా వాహనాలను తయారు చేయాలని కేంద్రం కంపెనీలకు సూచించింది. జూన్ 3న ఈ ఇంధనంతో నడిచే వాహనాలను హీరో మోటోకార్ప్ ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఇక జూన్ 4న మారుతీ సుజుకీ కూడా ఫ్లెక్స్ ప్యూయల్ ఇంధనంతో నడిచే వాహనాన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రానున్న రోజుల్లో అన్ని కంపెనీలు ఈ ఇంధనంతో పనిచేసే వాహనాలను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. దీంతో భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ వినియోగం అనేది తగ్గిపోతుందని, దేశంలో నిల్వలు పెరుగుతాయని కేంద్రం చెబుతోంది. అయితే ఈ వాహనాల వల్ల మైలేజ్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారుజ

 

Follow Us