ATM Alert: ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా ..? ఇది తెలియకపోతే నష్టపోతారు..!

ఏటీఎంలో చినిగిన నకిలీ రూ.500 నోట్లు బయటపడటం కలకలం రేపుతోంది. బ్యాంకు ఏటీఎంలపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. ఎలాంటి నకిలీ నోట్లు ఉండవని అనుకుంటారు. కానీ ఏటీఎంల నుంచే నకిలీ నోట్లు వస్తున్న ఘటనలు వినియోగదారులను షాక్‌కు గురి చేస్తున్నాయి. తాాజాగా..

ATM Alert: ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా ..? ఇది తెలియకపోతే నష్టపోతారు..!

Updated on: Dec 08, 2025 | 5:20 PM

దేశవ్యాప్తంగా నకిలీ నోట్లు కలకలం రేపుతోన్నాయి. కొంతమంది నకిలీ కరెన్సీని తయారుచేసి వాటిని చలామణిలోకి తీసుకొస్తున్నారు. అచ్చం ఓరిజినల్ నోట్ల తరహాలోనే ఇవి ఉంటున్నాయి. వీటిని చూస్తే నికిలీవి అని కూడా ఎవరికీ అనుమానం రావడం లేదు. ఇలాంటివాటిని పోలీసులు పట్టుకున్న ఘటనలు తరచూ వార్తల్లో చూస్తూ ఉంటాం. బయట షాపుల్లో అలా ఉంచితే.. ఏకంగా బ్యాంక్ ఏటీఎంల్లోనే నకిలీ నోట్లు బయటపడుతున్న ఘటనలు షాక్‌కు గురి చేస్తున్నాయి. ఏటీఎంల్లో నకిలీ నోట్లు బయటకొచ్చిన ఉదంతాలు గతంలో చాలానే చోటుచేసుకోగా.. తాజాగా అలాంటి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ ఏటీఎం నుంచి నకిలీ రూ.500 నోట్లు రావడం చూసి కస్టమర్లు అవాక్కయ్యారు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

పంజాబ్‌లోని జలంధర్‌లోని నకిలీ రూ.500 నోట్లు బయటపడ్డాయి. 66 అడుగుల రోడ్డులో ఉన్న ఇండస్ఇండ్ బ్యాంక్ ఏటీఎం నుంచి ఒక వ్యక్తి నగదు డ్రా చేశాడు. అయితే ఏటీఎం నుంచి నికిలీ చినిగిపోయిన రూ.500 నోట్లు బయటకొచ్చాయి. ఇతడికే కాకుండా ఈ ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసిన మరికొంతమందికి ఇలాంటి నోట్లే వచ్చాయి. ఈ నోట్లపై ఆర్‌బీఐ రాతతో పాటు ఆకుపచ్చ గీత కూడా లేదు. దీనిపై ఏటీఎం సెక్యూరిటీ గార్డుకు కస్టమర్లు ఫిర్యాదు చేయగా.. అతడు బ్యాంకు అధికారులకు వెంటనే సమాచారం అందించాడు. దీంతో బ్యాంక్ సిబ్బంది చేరుకుని ఏటీఎంను మూసివేశారు. బాధితులకు డబ్బులు తిరిగి ఇస్తామని హామీ కూడా ఇవ్వడంతో ఇంతటితో గొడవ సద్దుమణిగింది.

తొలుత ఓ వ్యక్తి రూ.10 వేలు విత్ డ్రా చేయగా.. చినిగిన నోట్లు వచ్చాయి. ఇక మరో వ్యక్తి రూ.4 వేలు డ్రా చేయగా.. అతడికి కూడా నకిలీ నోట్లు వచ్చాయి. అయితే బ్యాంకు సిబ్బంది ఈ వ్యవహారంపై స్ధానిక పోలీసులకు ఫిర్యాదు అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఏటీఎంలో నకిలీ, చినిగిన నోట్లు ఎలా వచ్చాయనే దానిపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకుని నకిలీ నోట్లను అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.