Facebook Loans: వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా.? అండగా ఫేస్‌బుక్‌ ఉంది. తక్కువ వడ్డీకే రుణాలు. హైదరాబాద్‌లో కూడా..

|

Aug 20, 2021 | 5:28 PM

Facebook Loans: 2004 ఫిబ్రవరి 4వ హార్వర్డ్‌ యూనివర్సిటీలో మార్క్ జుకెర్ బర్గ్ కొందరు స్నేహితులతో కలిసి చిన్నగా ప్రారంభించాడు. విద్యార్థుల మధ్య సమాచార వారధి కోసం ఉపయోగపడాలన్నది అప్పుడు...

Facebook Loans: వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా.? అండగా ఫేస్‌బుక్‌ ఉంది. తక్కువ వడ్డీకే రుణాలు. హైదరాబాద్‌లో కూడా..
Facebook Loans
Follow us on

Facebook Loans: 2004 ఫిబ్రవరి 4వ హార్వర్డ్‌ యూనివర్సిటీలో మార్క్ జుకెర్ బర్గ్ కొందరు స్నేహితులతో కలిసి చిన్నగా ప్రారంభించాడు. విద్యార్థుల మధ్య సమాచార వారధి కోసం ఉపయోగపడాలన్నది అప్పుడు జుకర్గ్‌ బర్గ్‌ ఆలోచన కానీ నేడు అది ఓ మహావృక్షంలా విస్తరించింది. ప్రపంప వ్యాప్తంగా ఏకంగా 120 కోట్లకు పైగా ఈ సోషల్‌ మీడియా సైట్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ సంఖ్య కొన్ని దేశాల జనాభాతో సమానం. ఓ చిన్న స్టార్టప్‌గా మొదలైన ఫేస్‌బుక్‌ ప్రస్థానం ఇప్పుడు ఇంత స్థాయికి చేరుకుంది. దీంతో ఫేస్‌బుక్‌ తాజాగా ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. తమలా చిన్నగా మొదలుపెట్టాలనుకుంటున్న స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు ఫేస్‌బుక్‌ ఇండియా రుణాలు ఇచ్చేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ లోన్‌ల ప్రక్రియను ప్రారంభించింది.

స్టార్టప్‌ కంపెనీలకు అండగా నిలిచే క్రమంలో ఫేస్‌బుక్‌ స్మాల్‌ బిజినెస్‌ లోన్‌ పేరుతో గతేడాది 100 మిలియన్‌ డాలర్లతో ప్రత్యేక నిధిని ఫేస్‌బుక్‌ ఏర్పాటు చేసింది. వీటితో 30 దేశాల్లోని మైక్రో, మీడియం బిజినెస్‌లో ఉన్న సంస్థలకు సాయం చేయనుంది. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమాన్ని భారత్‌లో అమలు చేయడానికి ఫేస్‌బుక్‌ ఇండిఫై అనే సంస్థంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఇండిఫై చిరు వ్యాపారులకు లోన్‌లు అందిస్తోంది. ఇక ఫేస్‌బుక్‌ స్మాల్‌ బిజినెస్‌ లోన్‌ ద్వారా రుణం పొందాలనుకునే వారు ఇండిఫై ద్వారా లోన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఫేస్‌బుక్‌ ఇండియాకు సుమారు రూ. 30 కోట్లు కేటాయించింది. వీటితో దేశంలోని సుమారు 200 పట్టణాల్లోని చిరు, మధ్యతరహా వ్యాపారులకు లోన్లు ఇవ్వనున్నారు. తొలి విడతలో భాగంగా ఈ పథకాన్ని హైదరాబాద్‌, న్యూఢిల్లీ, గురుగ్రామ్‌, ముంబయి, బెంగళూరులో అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా రూ. 5 నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు లోన్లు ఇస్తారు. తొలివిడతగా ఆగస్టు 20వ తేది నుంచి ఈ పథకాన్ని హైదరాబాద్‌, న్యూఢిల్లీ, గురుగ్రామ్‌, ముంబై, బెంగళూరులలో అమలు చేయనున్నారు. కనీసం మూడు వేల మందికి లోన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళా వ్యాపారులకు పురుషులతో పోలిస్తే మరింత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వనున్నారు. మరెందుకు ఆలస్యం వ్యాపార వేత్తగా మారాలనుకునే మీ కోరినను ఫేస్‌బుక్‌తో సాకారం చేసుకోండి.

Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఆయన పెట్టిన పోస్ట్‌ తొలగింపు.. ఎందుకంటే?

Kishan Reddy: కేసీఆర్ కుటుంబం అందుకే కంకణం కట్టుకుంది.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్

Gadgets Impact on Children: మీ చిన్నారులు మొబైల్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నారా? జాగ్రత్త..వారికి ఈ ప్రమాదం పొంచివుంది!