
జీవిత ధృవీకరణ పత్రం సమర్పించడానికి కొంత మంది పెన్షనర్లకు గడువు నుండి మినహాయింపు ఇవ్వబడింది. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి నవంబర్ 30 చివరి రోజుగా ఉండగా, ఈపీఎఫ్వో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) 1995 కింద వచ్చే వారికి ఈ గడువు వర్తించదు . ఈపీఎఫ్వో అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇచ్చిన సమాచారం ప్రకారం.. పెన్షనర్లు తమకు కావలసినప్పుడు లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవచ్చు. ఇది సమర్పించిన తర్వాత ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది.
‘ఈపీఎస్ 95’ కింద పెన్షనర్లు ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. ఇది ఒక సంవత్సరం పాటు చెల్లుబాటవుతుంది అని ఈపీఎఫ్వోట్వీట్ చేసింది. గతేడాది డిసెంబర్ 31న లైఫ్ సర్టిఫికెట్ సమర్పించినట్లయితే ఈ ఏడాది డిసెంబర్ 31లోపు సమర్పిస్తే సరిపోతుంది. మీరు 31 డిసెంబర్ గడువులోగా ఫైల్ చేయకపోతే 2023 జనవరి 1 నుండి పెన్షన్ నిలిపివేయబడుతుంది.
ఇప్పటి వరకు పింఛనుదారులు నవంబర్లో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉండేది. ఇది పింఛనుదారులకు పెద్ద సమస్యగా మారనుంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను రూపొందించడానికి ప్రజలు క్యూలలో వేచి ఉండాల్సి వచ్చింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి