EPFO: ఒక్క మిస్‌డ్ కాల్‌తో పీఎఫ్ సమాచారం.. అసలైన ఉపయోగమిదే..!

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ భారతదేశ ఉద్యోగుల కోసం మొట్టమొదటి సామాజిక భద్రతా పథకం. ఈ స్కీమ్ 1952లో స్వతంత్ర దేశంలో చట్టబద్ధం చేశారు. ఈ పథకం తరతరాలుగా ఉద్యోగులకు సేవలందిస్తూనే ఉంది. పదవీ విరమణ తర్వాత సంవత్సరాల్లో వారికి ఒకేసారి చెల్లింపుతో పాటు నెలవారీ పెన్షన్ (తరువాత 1995లో ప్రవేశపెట్టబడింది) ద్వారా గణనీయమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది.

EPFO: ఒక్క మిస్‌డ్ కాల్‌తో పీఎఫ్ సమాచారం.. అసలైన ఉపయోగమిదే..!
Epf Balance

Updated on: May 11, 2025 | 7:30 PM

ఈపీఎఫ్‌ స్కీమ్ ద్వారా ఉద్యోగులు ఆర్తిక భద్రతను పొందుతున్నారు. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ప్రాథమిక జీతంలో 12 శాతం ఉద్యోగి జీతం నుంచి తీసివేయబడుతుంది. అలాగే ఉద్యోగి పూర్తి సహకారం ఈపీఎఫ్ ఖాతాకు వెళుతుండగా, ఉద్యోగి సహకారంలో 3.67 శాతం అదే కార్పస్‌కు వెళ్తుంది. అయితే 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అని పిలిచే పెన్షన్ ఖాతాలోకి వెళ్తుంది. అయితే సగటు ఉద్యోగికి ఈపీఎఫ్ పీఎఫ్ బ్యాలెన్స్ ఏమిటో కష్టంగా ఉంటుంది.అయితే చిన్న మిస్డ్ కాల్ ద్వారా ఈపీఎఫ్ సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో మిస్‌డ్ కాల్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవచ్చో? చూద్దాం.

ఒక ఉద్యోగి అంటే ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్ 9966044425 నంబర్‌కు మిస్‌డ్ కాల్ ఇస్తే పీఎఫ్ సమాచారం తెలుసుకోవచ్చు. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే ఆటోమెటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది. అయితే మీరు ఈపీఎఫ్ఓ రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్ నుంచి మిస్‌డ్ కాల్ ఇస్తేనే పీఎఫ్ సమాచారం వస్తుంది. ఈ సేవకు అర్హత పొందే ముందు మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) మీ ఆధార్ లేదా పాన్ లేదా బ్యాంక్ ఖాతాకు లింక్ అయ్యిందని నిర్ధారించుకోవాలి. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ఎస్ఎంఎస్ ద్వారా సేవను కూడా ఉపయోగించవచ్చు. ఈ ఎస్ఎంఎస్‌ను వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899 కు పంపాలి. ఈ సేవలను ఇంగ్లిష్, హిందీతో పాటు స్థానిక భాషలైన బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు.

యూఏఎన్‌తో ఆధార్ లింక్ ఇలా

  • యూఏఎన్, పాస్‌వర్డ్ ఉపయోగించి యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి
  • “మేనేజ్” పై క్లిక్ చేయండి. “కేవైసీ” ఎంచుకోవాలి.
  • “యాడ్ కేవైసీ” ట్యాబ్‌కి వెళ్లి ఆధార్ వివరాలను టైప్ చేసి సబ్మిట్ చేయాలి.
  • తర్వాత యజమాని వివరాలను ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం యూఐడీఏఐ వివరాలను ధ్రువీకరించాల్సి ఉంటుంది 

పాన్ లింక్ ఇలా

  • యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ అవాలి.
  • మేనేజ్‌పై క్లిక్ చేసిన యాడ్ కేవైసీ ట్యాబ్‌కి వెళ్లి, పాన్‌ టైప్ చేసి సమర్పించాలి. 
  • అయితే ఈ వివరాలను యజమాని వివరాలను ఆమోదించాల్సి ఉంటుంది.