EPFO: పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసేవారికి కొత్త రూల్స్.. ఇది మర్చిపోతే డబ్బులు కోల్పోతారు.. నో రీఫండ్..

ఈపీఎఫ్ఓ సభ్యుల కోసం కొత్త టీడీఎస్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈపీఎఫ్ విత్‌డ్రాలపై టీడీఎస్ రీఫండ్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఫారం 121ని ప్రవేశపెట్టింది, పాత 15G, 15H ఫారాల స్థానంలో వీటిని తీసుకొచ్చారు. పీఎఫ్ విత్ డ్రా చేసేవారు వీటి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.

EPFO: పీఎఫ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసేవారికి కొత్త రూల్స్.. ఇది మర్చిపోతే డబ్బులు కోల్పోతారు.. నో రీఫండ్..
Epfo

Updated on: Oct 11, 2026 | 11:33 AM

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు శుభవార్త. ఈపీఎఫ్ విత్‌డ్రాలపై వర్తించే టీడీఎస్ (TDS) నిబంధనలలో ఈపీఎఫ్ఓ కీలక మార్పులు చేసింది. పీఎఫ్ విత్ డ్రాకు సంబంధించి టీడీఎస్ మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. గతంలో ఇందుకోసం ఫారంలు 15G, 15H దాఖలు చేసింది. అయితే వీటి స్థానంలో కొత్త ఫారంను ఈపీఎఫ్ఓ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి  ప్రవేశపెట్టింది. ఫారం 15జీ, 15 హెచ్ స్థానంలో కొత్త ఫారం 121ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫారం 121 గురించి ప్రతి ఈపీఎఫ్ఓ సభ్యుడు తెలుసుకోవాల్సిన అవసరముంది. ఈపీఎఫ్ విత్‌డ్రాలపై టీడీఎస్ వర్తించాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి.  ఒక కంపెనీలో లేదా వివిధ కంపెనీలలో కలిపి ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసినవారికి ఈపీఎఫ్ విత్‌డ్రాలపై టీడీఎస్ వర్తించదు. ఒకవేళ ఐదేళ్ల సర్వీసు పూర్తి కాకముందే ఈపీఎఫ్ విత్‌డ్రా చేసినవారికి టీడీఎస్ వర్తిస్తుంది. అయితే మీరు ఈపీఎఫ్ఓ అకౌంట్ నుంచి రూ.50 వేల కంటే కంటే ఎక్కువ క్లెయిమ్ చేసుకుంటే టీడీఎస్ వర్తిస్తుంది. రూ. 50 వేల కంటే తక్కువ ఉంటే టీడీఎస్ వర్తించదు.

ఐదేళ్ల కంటే తక్కువ సర్వీసు ఉండి రూ. 50 వేల కంటే ఎక్కువ మొత్తం విత్‌డ్రా చేస్తే టీడీఎస్ కట్ అవుతుంది. ఐదేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత మీరు ఎంత మొత్తం విత్‌డ్రా చేసినా టీడీఎస్ ఉండదు. ఈపీఎఫ్ఓ వెబ్‌పోర్టల్‌లో పాన్ నెంబర్ అప్టేడ్ చేసుకోవడం చాలా ముఖ్యం. పాన్ నెంబర్ ఇస్తే సాధారణంగా 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది.  ఒకవేళ పాన్ నెంబర్ అందించకపోతే 20 శాతం వరకు టీడీఎస్ కట్ అయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేయకపోయినా టీడీఎస్ వర్తించదు. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే నిరంతర సర్వీసుగా పరిగణిస్తారు. ఇలాంటి సమయంలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసినట్లుగా భావించి టీడీఎస్ మినహాయింపు సౌకర్యం కల్పిస్తారు. ఇక తీవ్రమైన ఆరోగ్య సమస్యల కారణంగా విత్‌డ్రా చేస్తే టీడీఎస్ ఉండదు. అలాగే కంపెనీ మూసివేయబడటం వల్ల ఉద్యోగం కోల్పోయినప్పుడు పీఎఫ్ బ్యాలెన్స్ విత్‌డ్రా చేస్తే టీడీఎస్ వర్తించదు. మీరు ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో కూడా టీడీఎస్ ఉండదు.

ఒకవేళ మీరు పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేసినన్పుడు టీడీఎస్ కట్ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ మొత్తం ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోతే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్  ఫైల్ చేసి టీడీఎస్ మొత్తం రీఫండ్ పొందవచ్చు.  ఇందుకోసం పాత ఫారంలు 15G, 15H స్థానంలో కొత్తగా ఫారం 121ను ప్రవేశపెట్టారు. గతంలో 60 సంవత్సరాల లోపు వారు ఫారం 15Gని, సీనియర్ సిటిజన్లు ఫారం 15Hని సమర్పించేవారు. ఇకపై ఈ రెండింటి స్థానంలో ఒకే ఫారం 121 తీసుకొచ్చారు. ఇది సమర్పించడం ద్వారా టీడీఎస్ మినహాయింపులు పొందవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us