EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బిగ్ న్యూస్.. ఈ వివరాలు చెక్ చేస్కోండి.. తప్పులుంటే సమస్యలే..

ఈపీఎఫ్ఓలో ఖాతాదారులుగా ఉన్నారా.. అయితే మీకో అలర్ట్. కేవైసీ వివరాలు అనేది ఎప్పుడూ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే పీఎఫ్ సేవలు పొందటంలో మీకు ఇబ్బందులు ఎదురుకావొచ్చు. యూఏఎన్ పోర్టల్‌లోకి వెళ్లి మీరు సులువుగా కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. అదెలా అంటే..

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బిగ్ న్యూస్.. ఈ వివరాలు చెక్ చేస్కోండి.. తప్పులుంటే సమస్యలే..
Epfo

Updated on: May 20, 2026 | 10:43 AM

ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ పీఎఫ్ అకౌంట్లో ఎప్పుడూ వివరాలు సరి చూసుకుంటూ ఉండాలి. కేవైసీ వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయా..? లేదా? అనేది చెక్ చేసుకోవాలి. ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వివరాల్లో తప్పులు లేకుండా చేసుకోవాలి. ఒకవేళ తప్పుడు వివరాలు ఉంటే ఈపీఎఫ్ఓ క్లెయిమ్స్, బదిలీలు, కేవైసీ వెరిఫికేషన్ ప్రక్రియ వంటి సేవల్లో అంతరాయం కలగొచ్చు. ఈపీఎఫ్ఓ సేవలు సజావుగా పొందేందుకు యూఏఎన్ పోర్టల్‌లో కేవైసీ వివరాలు అప్డేట్‌గా ఉంచుకోవాలి. ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలను లింక్ చేసుకోవాలి. దీంతో పీఎఫ్ విత్ డ్రా, అకౌంట్ ట్రాన్స్‌ఫర్, పెన్షన్ వంటి సేవలు ఆన్‌లైన్‌లో సులువుగా పొందవచ్చు. యూఏఎన్ పోర్టల్‌లోకి వెళ్లి మీరు సులువుగా కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు.

కేవైసీ వివరాలు చూసుకోండి..

ఉద్యోగాలు మారాలనుకునేవారు, పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయాలనుకునేవారు ఖచ్చితంగా కేవైసీ రికార్డులు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ గుర్తింపు కార్డు వంటి వివరాలను ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో అనుసంధానించాలి. ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ఓ సేవలు పొందాలంటే వీటిని లింక్ చేసుకోవడం అనేది తప్పనిసరి. లేకపోతే మీరు ఎలాంటి సర్వీసులు పొందలేరు. ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్ డ్రా, కంపెనీ మారినప్పుడు పీఎఫ్ అకౌంట్ బదిలీ, పెన్షన్ క్లెయిమ్ ప్రాసెసింగ్, ప్రొఫైల్ వెరిఫికేషణ్, వేగవంతమైన క్లెయిమ్ పరిష్కారం వంటి పనులకు కేవైసీ వివరాలు అవసరం. తప్పుడు లేదా అసంపూర్తిగా సమాచారం ఉండటం వల్ల ఆన్ లైన్ సేవలు పొందే సమయంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చు.

కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలంటే..?

ఆన్‌లైన్‌లో కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలంటే.. ముందుగా కొన్ని పరిశీలించుకోవాలి. యూఏఎన్ నెంబర్ యాక్టివ్‌గా ఉంచుకోవాలి. యూఏఎన్ పోర్టల్ పాస్ వర్డ్, ఆధార్‌తో మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండటం, పాన్ కార్డు వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అన్నీ ముందుగా సిద్దం చేసుకుని ఉండాలి. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి.

ఆన్లైన్‌లో ఎలా చేసుకోవాలి..?

-ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లోకి వెళ్లండి

-మేనేజ్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి

-కేవైసీ అనే ఆప్షన్ ఎంచుకోండి

-ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నారనేది ఎంచుకోండి

-వివరాలను నమోదు చేయండి

-డిక్లరేషన్ బాక్స్‌పై టిక్ చేయండి

-సేవ్ ఆప్షన్ ఎంచుకోండి

-పెండింగ్ కేవైసీలోకి వెళ్లి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు

Follow Us