
పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్నవారు కొన్ని పనులు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్నింటిని తప్పనిసరి చేసింది. అందులో ఒకటి ఈ-నామినేషన్. గతంలో నామినేషన్ తప్పనిసరి అనే నిబంధన లేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా నామినీ వివరాలను పొందుపర్చాలి. లేకపోతే మీరు ఆన్‌లైన్‌లో పీఎఫ్ సేవలు పొందలేరు. చాలామంది నామినీని నమోదు చేయడాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఖచ్చితంగా అందరూ చేసుకోవాల్సి వస్తోంది. ఆన్‌లైన్‌లో మీరు సులువుగా నామినీ వివరాలను అప్డేట్ చేయవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.
పీఎఫ్ ఖాతాదారుడికి ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగి మరణిస్తే.. కుటుంబసభ్యులకు నిధులు అందుతాయి. పీఎఫ్ అకౌంట్లోని నగదును నామినికి అందిస్తారు. అలాగే రూ.7 లక్షల జీవిత బీమా కూడా ఈపీఎఫ్‌వో అందిస్తోంది. ఉద్యోగంలో ఉన్నప్పుడు మరణిస్తే రూ.7 లక్షలను నామినీకి అందిస్తారు. దీంతో నామినీ వివరాలను ఈపీఎఫ్‌వోకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ నామినీ వివరాలు అందించకపోతే మీ పీఎఫ్ అకౌంట్లోని నగదును కుటుంబసభ్యులు క్లెయిమ్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈపీఎఫ్‌వో కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అదే ముందుగానే నామినీ వివరాలను ఆన్‌లైన్‌లో అందించడం వల్ల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించకుండానే ఆన్‌లైన్‌లో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
-ఈపీఎఫ్‌వో వెబ్ సైట్ https://www.epfindia.gov.in/site_hi/index.php తెరవండి
-హోం పేజీలో సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకోండి
-ఫర్ ఎంప్లాయిస్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి
-యూఏఎన్ ఆన్ లైన్ సర్వీసెస్ ఆప్షన్ ఎంచుకోండి
-మీ యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
-ఆ తర్వాత మెనూ బార్‌లో మేనేజ్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి
-అనంతరం ఈ-నామినేషన్‌పై క్లిక్ చేయండి
-అక్కడ Having Family దగ్గర యస్ అని ఎంచుకోండి
-నామినీ ఆధార్ నెంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మీతో ఉన్న బంధుత్వం, అడ్రస్ వివరాలు ఎంటర్ చేయండి
-ఆ తర్వాత నామినీ ఫొటో అప్ లోడ్ చేయండి
-మరో నామినీని యాడ్ చేయాలంటే ‘Add Row’ పై క్లిక్ చేయండి
-నామినీకి మీ సొమ్ములో ఎంత షేర్ ఇవ్వాలనుకుంటున్నారనేది ఎంటర్ చేసి సేమ్ ఫ్యామిలీ డీటైల్స్‌పై క్లిక్ చేయండి
-ఆ తర్వాత ఈ-సైన్ చేయండి
-ఆధార్‌కు వచ్చే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఈ-సైన్ ప్రాసెస్ పూర్తవుతుంది.