EPFO e-Nomination: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ చందాదారుల కోసం అనేక ఆన్‌లైన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ పెరిగిన కారణంగా చిన్న చిన్న అవసరాల కోసం ఈపీఎఫ్‌వో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ-నామినేషన్ సర్వీస్ అనేది ఆన్‌లైన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు పీఎఫ్ ఖాతా ఉంటే అందులో నామిని పేరును నమోదు చేయాలి. లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే వచ్చే డబ్బులు రావు. అయితే ఈపీఎఫ్ నామినీని మార్చడానికి పీఎఫ్ సభ్యులు కొత్త నామినేషన్ దాఖలు చేయవచ్చని ఈపీఎఫ్‌ఓ ట్వీట్ చేసింది. తాజాగా పీఎఫ్ అకౌంట్లో నామినీ పేరును ఫైనల్‌గా పరిగణిస్తారు.
అయితే పీఎఫ్ ఉద్యోగులకు వివిధ సర్వీసులను సులభతరం చేసేందుకు ఈపీఎఫ్‌ఓ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. నామినేషన్ పేరు చేర్చేందుకు ఈపీఎఫ్‌ఓ కార్యాలయానికి వెళ్లకుండానే ఆన్‌లైన్ సేవలు అందిస్తోంది. అయితే ఈ-నామినేషన్ చేయడం ద్వారా ఖాతాదారుడు మరణించినట్లయితే రూ.7 లక్షల వరకు నామినీకి లభిస్తాయి. ఈ-నామినేషన్ కోసం పీఎఫ్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ ద్వారా చేసుకునే వెసులుబాటు ఉంది. ఆన్‌లైన్ ద్వారా మీ నామినీ పేరును చేర్చుకోవచ్చని ఈపీఎఫ్‌ఓ తెలిపింది. ఒక వేళ మీరు నామినీ పేరును చేర్చనట్లయితే ఈ విధంగా చేసుకోవచ్చు.
ఈపీఎఫ్‌ఓలో నామినీ చేర్చండిలా..
► ముందుగా ఈపీఎఫ్‌ఓ పోర్టల్ అధికారిక లింక్‌పై క్లిక్ చేసి ఓపెన్ చేయాలి.
► యుఎఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
► మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్‌అఫ్ వస్తుంది. అప్పుడు దానిపై లేదా ఈ-నామినేషన్‌పై క్లిక్ చేయాలి.
► ఆ తర్వాత ఫ్యామిలీ డిక్లరేషన్ అప్‌డేట్ కొరకు క్లిక్ చేయాలి.
► తర్వాత ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంకు అకౌంట్ తదితర వివరాలు నమోదు చేయాలి.
► వాటాకు సంబంధించిన వివరాలు నమోదు చేసేందుకు నామినేషన్ వివరాలు అనేదానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సేవ్ ఈపీఎఫ్ నామినేషన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
► ఓటీపీ జనరేట్ చేయడం కొరకు ఈ-సైన్‌పై క్లిక్ చేసిన తర్వాత ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ ఈ-నామినేషన్ రిజిస్టర్ అవుతుంది. ఈ ప్రాసెస్ ద్వారా ఈ-నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ఇలాంటి విషయాలను ఈపీఎఫ్‌ఓ ట్విటర్, సోషల్ మీడియా ద్వారా వినియోగదారులకు అవగాహన కల్పిస్తోంది. ఆన్‌లైన్‌లో ఈ-నామినేషన్ సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెబుతోంది. ఈ పనిని కేవలం ఐదు నిమిషాల్లోనే పూర్తి చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీ ఆధార్ నంబర్ యూఏఎన్‌కు లింక్ అయి ఉండాలి. అప్పుడు ఈ సేవను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కూడా ఉండాలి.
#EPF सदस्य मौजूदा EPF/#EPS नामांकन को बदलने के लिए नया नामांकन दाखिल कर सकते हैं।#EPF Members can file new nomination to change existing EPF/#EPS nomination.#EPFO #Services #Pension #ईपीएप #पीएफ pic.twitter.com/rm3G2FaqKy
— EPFO (@socialepfo) November 18, 2021
ఇవి కూడా చదవండి: