EPFO: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పీఎఫ్ డెత్ అమౌంట్‌ డబుల్.. ఎంతో తెలుసా..?

ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ ఖాతాదారుల కుటుంబాలకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే, అతని కుటుంబానికి లభించే ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని భారీగా పెంచింది. ద్యోగుల కుటుంబాల ఆర్థిక భద్రతను బలోపేతం చేయడానికి ఈపీఎఫ్‌వో ఈ చర్య తీసుకుంది. ఎంతకు పెరిగిందంటే..?

EPFO: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పీఎఫ్ డెత్ అమౌంట్‌ డబుల్.. ఎంతో తెలుసా..?
EPFO

Updated on: Aug 21, 2025 | 1:34 PM

పీఎఫ్ అనేది ప్రైవేట్ ఎంప్లాయిస్‌కు బంగారు నిధి. కష్టసమయాల్లో ఇది ఎంతో యూజ్ అవుతుంది. దేశంలో పనిచేసే దాదాపు ప్రతి ఉద్యోగికి పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. దీనిని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. పీఎఫ్‌కు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది. తాజాగా ఈపీఎఫ్‌వో తన సభ్యులకు, వారి కుటుంబాలకు గొప్ప శుభవార్త అందించింది. పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే.. అతని కుటుంబానికి లభించే డెత్ రిలీఫ్ ఫండ్ (ఎక్స్‌గ్రేషియా) మొత్తాన్ని రూ. 8.8 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే ఒక ఉద్యోగి ఈ తేదీ తర్వాత మరణిస్తే, అతని కుటుంబానికి రూ. 8.8 లక్షలకు బదులుగా రూ. 15 లక్షలు లభిస్తాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మార్పులకు ఆమోదం తెలిపింది.

మరో గుడ్ న్యూస్ కూడా తెలిపింది. ఏప్రిల్ 1, 2026 నుండి ఈ ఎక్స్‌గ్రేషియా ప్రతి సంవత్సరం 5 శాతం పెరుగుతుందని ఈపీఎఫ్‌వో నిర్ణయించింది. దీంతో కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయం కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుంది. కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈపీఎఫ్‌వో కుటుంబాలకు సహాయాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది.

ఆ ప్రక్రియ మరింత ఈజీ

అంతేకాకుండా పీఎఫ్ ఖాతాదారుడు మరణించిన తర్వాత, డబ్బు మైనర్ పిల్లలకు చెందాల్సి వస్తే, క్లెయిమ్ ప్రక్రియను ఇప్పుడు మరింత సులభతరం చేశారు. ఇంతకుముందు గార్డియన్‌షిప్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాల్సి వచ్చేది. దీంతో క్లెయిమ్ ప్రక్రియ ఆలస్యం అయ్యేది. కానీ, ఇప్పుడు ఈ నిబంధనను తొలగించారు. ఈ మార్పుతో మైనర్ పిల్లలు డబ్బును త్వరగా పొందే అవకాశం ఉంది.

ఆర్థిక భద్రత బలోపేతం

ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక భద్రతను బలోపేతం చేయడానికి ఈపీఎఫ్‌వో ఈ చర్య తీసుకుంది. రూ. 15 లక్షల పెరుగుదల, తరువాత వార్షికంగా 5 శాతం పెరుగుదలతో కుటుంబాలకు ఇప్పుడు మెరుగైన సహాయం లభిస్తుంది. అదనంగా క్లెయిమ్‌ల ప్రక్రియలో మెరుగుదలలు సకాలంలో డబ్బును స్వీకరించడాన్ని సులభతరం చేస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..