EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ వడ్డీని త్వరలోనే జమ చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్ధికశాఖ ఆమోదం తెలిపింది. దీంతో పీఎఫ్ వడ్డీని జమ చేసేందుకు లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు. జులై నెలలో అకౌంట్లలో వడ్డీ పడే అవకాశముందని తెలుస్తోంది.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..
Epfo

Updated on: Jun 19, 2026 | 8:11 AM

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే పీఎఫ్ వడ్డీని ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆమోదం రావడంతో త్వరలోనే ఖాతాదారుల అకౌంట్లో జమ చేయనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును ఇవ్వాలని మార్చిలో జరిగిన మీటింగ్‌లో ఈపీఎఫ్‌వో ఆమోదించింది. ఆ తర్వాత దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపింది. ఇప్పుడు ఆర్ధికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈపీఎఫ్ఓ త్వరలో 7 కోట్లకు పైగా ఖాతాదారుల ఖాతాలకు వడ్డీ మొత్తాన్ని జమ చేయనుంది.

త్వరలోనే ఖాతాల్లో జమ

ఈపీఎఫ్‌వో డిపాజిట్లకు ప్రభుత్వం హామీదారుగా వ్యవహరిస్తుంది. దీని వల్ల ఈపీఎఫ్‌వో ​​నిర్ధారించిన వడ్డీ రేటును అమలు చేయడానికి ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం అవసరం. ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ 8.25 శాతం వడ్డీ రేటును ఆమోదించింది. దీంతో కార్మిక మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈపీఎఫ్‌వో ​​వడ్డీ మొత్తాన్ని ఖాతాలలో జమ చేసే ప్రక్రియను ప్రారంభించనుంది. జూన్‌లోనే ప్రక్రియ మొదలుకానుడంగా.. జులైలో ఖాతాదారుల అకౌంట్లలో పడనుంది. దీంతో జులైలో తమ పాస్ బుక్‌లో వడ్డీ సొమ్మును ఖాతాదారులు చెక్ చేసుకోవచ్చు. 8.20 శాతం వడ్డీ రేటు కొనసాగడం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు తమ డిపాజిట్లపై మెరుగైన రాబడిని పొందనను్నారు. ఆర్ధికశాఖ ఆమోదం కూడా రావడంతో ఈపీఎఫ్‌ఓ ఎప్పుడు వడ్డీ మొత్తాన్ని ఖాతాల్లో జమ చేస్తుందనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ ప్రక్రియ సకాలంలో పూర్తయితే వెంటనే క్రెడిట్ అవ్వనుంది.

కొత్త డిజటల్ వ్యవస్థ

అయితే ఈపీఎఫ్‌ఓ ​​ఇటీవల ఒక కొత్త డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనివల్ల వడ్డీ చెల్లింపులు మునుపటి కంటే చాలా వేగంగా ఖాతాలకు బదిలీ కానున్నాయి. దీనివల్ల త్వరలో లక్షలాది మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు. ఈపీఎఫ్‌ఓ 2024-25 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.25 శాతంగా కొనసాగించింది. అటు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.15 శాతం నుండి 8.25 శాతానికి పెంచింది. ఇక ​​2021-22 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.10 శాతానికి తగ్గించింది. అంతకముందు 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 8.50 శాతంగా ఉండేది. 2019-20లో వడ్డీ రేటు 8.50 శాతం, 2018-19లో 8.65 శాతం, 2015-16లో 8.80 శాతంగా ఉంది. అంతకముందు 2013-14, 2014-15లో 8.75 శాతం వడ్డీ చెల్లించారు.

Follow Us