Tesla Motors: 2022 నుంచి భారత్‌లో టెస్లా మోడల్-3 విక్రయాలు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

|

Dec 03, 2021 | 7:12 PM

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ త్వరలో ఎలక్ట్రిక్ కారును భారత్‌కు తీసుకువస్తానని ప్రకటించి ఏడాది గడిచింది. అయితే ఇప్పటి వరకు దాని రాకపై..

Tesla Motors: 2022 నుంచి భారత్‌లో టెస్లా మోడల్-3 విక్రయాలు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Elon Musk's Tesla Motors
Follow us on

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ త్వరలో ఎలక్ట్రిక్ కారును భారత్‌కు తీసుకువస్తానని ప్రకటించి ఏడాది గడిచింది. అయితే ఇప్పటి వరకు దాని రాకపై ఎలాంటి సమాచారం లేదు. 2022 మధ్యలో టెస్లా భారతదేశంలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. దేశంలోని ధనవంతులు, ప్రముఖులు ఈ కారు కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ప్రభుత్వం, ఎలాన్ మస్క్ మధ్య దిగుమతి సుంకం వివాదం ఈ నిరీక్షణను మరింత పెంచుతోంది. గత నెలలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారతదేశంలో టెస్లా కారు ధర సుమారు రూ. 35 లక్షలు ఉంటుందని తెలియజేశారు. టెస్లా మోడల్ 3ని 2021లో వివిధ ప్రదేశాలలో పరీక్షిస్తున్నప్పటికీ, భారతదేశంలో దీన్ని విక్రయించడానికి ఇంకా ఖచ్చితమైన చర్యలు తీసుకోవలసి ఉంది.

భారతదేశంలోని 2 నగరాల్లో కార్యాలయాలు..
భారత్‌లో ఇప్పటికే 2 నగరాల్లో కార్యాలయాలను టెస్లా ఏర్పాటు కూడా చేసింది. ఇది టెస్లా, ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరుస్తుందని రీసెర్చ్ అనలిస్ట్ సౌమన్ మండల్ పేర్కొన్నారు. అందుకే భారత్‌లో ధర తగ్గించి విక్రయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదే సమయంలో, టెస్లా కూడా దీని కోసం పూర్తి సన్నద్ధతలో ఉంది. కంపెనీ ఇప్పటికే ముంబైలో కార్పొరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అలాగే బెంగళూరులోనూ కార్యాలయాన్ని ప్రారంభించింది. మనదేశంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి కీలక అధికారుల కోసం వెతుకుతోంది.

ప్రస్తుతం, భారతదేశంలో టెస్లా మోడల్ 3కి యూఎస్‌లో $39,990 (రూ. 30 లక్షలు) దిగుమతి సుంకం ఎక్కువగా ఉంది. కానీ, భారతదేశంలో దిగుమతి సుంకంతో దాదాపు రూ.60 లక్షలు అవుతుంది. ఏది చాలా ఎక్కువ. ప్రస్తుతం, భారతదేశంలో రూ. 30 లక్షల కంటే ఎక్కువ విలువైన కార్ల దిగుమతిపై బీమా, షిప్పింగ్ ఖర్చుతో సహా 100% పన్ను ఉంటుంది. అదే సమయంలో, రూ. 30 లక్షల కంటే తక్కువ ధర కలిగిన కార్లను దిగుమతి చేసుకునేందుకు 60% వరకు దిగుమతి సుంకం చెల్లించాలి.

2021ని ‘ఒక పీడకల’గా పోల్చిన మస్క్..
ఎలాన్ కంపెనీ స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ సేవను తీసుకురావడంలో కూడా జాప్యం జరుగుతోంది. సప్లయ్ చైన్‌ సమస్యపై 2021ని ‘ఒక పీడకల’గా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్‌ పోల్చారు. టెస్లా కంపెనీ నుంచి త్వరలో రాబోయే Tesla Cybertruck ఉత్పత్తి గురించి మాట్లాడుతూ.. తన బాధను వ్యక్తం చేశాడు. “ఓ డ్యూడ్! ఈ ఏడాది సప్లయ్‌ చెయిన్‌ వ్యవస్థ పీడకలగా మిగిలిపోయింది. అది ఇంకా ముగిసేలా కనిపించడం లేదు. రాబోయే కాలంలో ఈ ట్రక్కుకు సంబంధించి మరిన్ని అప్‌డేట్‌లను అందిస్తానని మస్క్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

Also Read:  Crypto Currency Bill: క్రిప్టోకరెన్సీ బిల్లు సరైన చర్య అంటున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.. ఎందుకంటే..

SBI: ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఇలా చేయండి.. ఖాతాదారులకు ఎస్‌బీఐ ట్వీట్..