Telugu News Business E Shram Card Registration: All you need to know about online registration process, eligibility criteria and benefits
E-Shram Card: ఒక్క కార్డుతో లక్షలాది రూపాయల ప్రయోజనం.. ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి..
దేశంలోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సామాజికంగా, ఆర్ధికంగా భద్రత కల్పించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇ-శ్రమ్ యోజనను ప్రారంభించింది.
దేశంలోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సామాజికంగా, ఆర్ధికంగా భద్రత కల్పించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇ-శ్రమ్ యోజనను ప్రారంభించింది. ఇ-శ్రమ్ యోజనను 2021 ఆగస్టు 26న ప్రధాని మోడీ ప్రారంభించారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఇ-శ్రమ్ లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్రణాళిక కింద ప్రభుత్వం కార్మికులకు పలు ప్రయోజనాలతోపాటు నగదు సహాయం కూడా అందిస్తుంది. ఈ పథకం కింద కార్మికుల కుటుంబాలకు బీమా పరిహారం అదనంగా అందిస్తారు. లబ్ధిదారుడు తప్పనిసరిగా ఇ-శ్రమ్ యోజన (ఇ-శ్రమ్ పోర్టల్ రిజిస్ట్రేషన్)ని ఉపయోగించే ముందు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కార్మికులతో పాటు, చిరు వ్యాపారులు, సాధారణ నివాసితులు, యువకులు, తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన వారు ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకోని లబ్ధి పొందవచ్చు.
E- S hram కార్డ్ అర్హత ప్రమాణాలు..
16 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారు ఇ-శ్రమ్ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత నమోదు చేసుకున్న వారికి 12 అంకెల ప్రత్యేక నంబర్ (UAN) లభిస్తుంది. ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసిన తర్వాత ప్రతి అసంఘటిత కార్మికుడికి అందించిన 12-అంకెల శాశ్వత ప్రత్యేక సంఖ్యను పరిగణలోకి తీసుకుని ప్రయోజనాన్ని అందిస్తారు.