నకిలీ రాయుళ్లపై కొరఢ.. వేగం పెంచిన తెలంగాణ అధికారులు

|

Jun 06, 2020 | 6:31 PM

తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా జాయింట్‌ ఆపరేషన్లను చేపడుతున్నారు. రైతులను మోసం చేస్తూ దండుకునేందుకు యత్నిస్తున్న నకిలీ రాయుళ్లపై కొరఢా ఝులిపిస్తున్నారు.

నకిలీ రాయుళ్లపై కొరఢ.. వేగం పెంచిన తెలంగాణ అధికారులు
Follow us on

ఖరీఫ్‌ ప్రారంభంతో నకిలీ విత్తనాల అమ్మకం.. రైతులను నట్టేటా ముంచేలా చేస్తోంది. ఒరిజినల్‌ విత్తనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. గ్రామాల్లో తిరుగుతున్న అలాంటి ముఠాల భరతం పడుతున్నారు అధికారులు.

తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా జాయింట్‌ ఆపరేషన్లను చేపడుతున్నారు. రైతులను మోసం చేస్తూ దండుకునేందుకు యత్నిస్తున్న నకిలీ రాయుళ్లపై కొరఢా ఝులిపిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్ద ఎత్తున పత్తి, వరి విత్తనాలను అమ్మకంపై నిఘా పెట్టిన అధికారులకు.. దళారులు సాగిస్తున్న దందా బయటపడింది. ఏజెన్సీ రైతులే టార్గెట్‌గా.. అమ్ముతుండడంతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లతో దాడులను విస్తృతం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ వారంరోజుల్లోనే సుమారు 4 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను సీజ్‌ చేశారు. దాదాపు ఆరు ముఠాలను ఈ దాడుల్లో పట్టుకున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌లో…

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఐటీడీఏ ఎజెన్సీలోని నార్నూర్‌, ఇంద్రవెళ్లి, కడం ప్రాంతాలలో పాటు.. బెల్లంపల్లి, చింతలమానెపల్లి, బాబాసాగర్‌ పరిధిలో ఈ ముఠాలు చిక్కాయి. 12 ప్రాంతాల్లో సోదాలు జరిపిన అధికారులు నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుంటూ వారిపై పీడీ యాక్ట్‌ పెట్టేలా ముందుకు కదులుతున్నారు. నిర్మల్‌ జిల్లాలో 8 మంది, మంచిర్యాలలో 9 మంది, ఆసిఫాబాద్‌లో నలుగురు పట్టుబడగా.. వారు ఇంకా ఏయే ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు అమ్మారు.. ఎక్కడ వీటిని తయారు చేస్తున్నారన్న లోగుట్టును లాగే పనిలో పడ్డారు.

నకిలీ విత్తనాలకు చెక్…

ఇటు.. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోనూ నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. పత్తిరైతులను ధగా చేసేందుకు కాచుకుకూర్చున్న కేటుగాళ్ల పీచం అణుచుతున్నారు. స్థానిక బసవేశ్వర విగ్రహం దగ్గర ఓ ఇంటిని అద్దెకు తీసుకుంటున్న ఉంటున్న మహబూబ్‌నగర్‌కు చెందిన రాములు, వెంకటేష్‌ మూడేళ్లక్రితం మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ కావడంతో వీరు శామీర్‌పేటకు చెందిన శ్రీనివాస్‌ నుంచి రఘు 39 పేరుగల కల్తీ పత్తివిత్తనాలను తీసుకుని ఐదు గ్రామాల్లో అమ్మాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతని నుంచి 2.5 లక్షల విలువ చేసే నకిలీ సీడ్స్‌ను స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు.