Banking: ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ అనివార్యంగా మారిపోయింది. ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరాలన్నా, జీతం పొందాలన్నా బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే. బ్యాంకులు కూడా ఖాతాదారులకు రకరకాల సౌకర్యాలను అందిస్తుంటాయి. ఇందులో భాగంగానే ఖాతాదారులకు బ్యాంకులు పలు నిబంధనలను విధిస్తుంటాయి. ఇందులో సేవింగ్స్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ ఉండడం. కొన్ని జీరో అకౌంట్స్ ఉన్నా, మరికొన్ని ఖాతాల్లో మాత్రం తప్పకుండా కొంతమేర బ్యాలెన్స్‌ను మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. అలా కనీస మొత్తాన్ని మెయింటేన్ చేయకపోతే బ్యాంకులు ఖాతాదారుల నుంచి పెనాల్టినీ వసూలు చేస్తాయి. ఇలా మినిమమం బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టి వసూలు చేసే బ్యాంక్స్‌లో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐతో పాటు ప్రైవేటు బ్యాంక్ ఐసీఐసీఐ ఎలాంటి పెనాల్టినీ వసూలు చేస్తుంది లాంటి వివరాలు తెలుసుకుందాం..
స్టేట్ బ్యాంక్ ఆఫ ఇండియా అర్బన్ ఏరియా బ్రాంచ్‌లో అకౌంట్ ఉంటే తప్పనిసరిగా కనీసం రూ. 1000ని మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంతే మొత్తాన్ని ఉంచుకోవాల్సి వస్తుంది. అయితే మెట్రో నగరాల్లో మాత్రం రూ. 3 వేలు మినిమం బ్యాలెన్స్‌గా ఉండాలి.
ప్రైవేటు రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐలో ఈ మినిమం బ్యాలెన్స్ కొంత ఎక్కువేనని చెప్పాలి. అర్బన్ లేదా మెట్రో సిటీ బ్రాంచ్‌లలో బ్యాంక్ అకౌంట్ ఉంటే కనీసం రూ. 10,000 మినిమం బ్యాలెన్స్ ఉండాలి, ఇక సెమీ అర్బన్‌లో రూ. 5,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2500 కనీస మొత్తం ఉండేలా చూసుకోవాలి. లేని పక్షంలో జరిమానా విధిస్తారు. అయితే ఇంతమొత్తంలో మినిమం బ్యాలెన్స్ ఉండాలనే నిబంధన విధించిన బ్యాంక్‌లు కస్టమర్లకు కూడా అదే విధంగా పలు ప్రత్యేక సేవలు అందిస్తుంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..