Festival Shopping Tips: పండగకు షాపింగ్ చేస్తున్నారా? అయితే మీరు ముందుగా ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..

|

Oct 16, 2023 | 4:22 PM

ఆన్ లైన్.. ఆఫ్ లైన్ అనే తేడా లేదు షాపింగ్ చేయడం కొంతమందికి ఓ రోజువారీ అలవాటుగా మారిపోయింది. అయితే, షాపింగ్ చేస్తారు కానీ.. కొన్న వస్తువులకు ఎలాంటి క్వాలిటీ చెక్ గురించి పెద్దగా ఆలోచించరు. తమకు తెలిసిన విధానంలో అది బావుందా లేదా అని చూస్తారు.. కొనేస్తారు. కానీ, మన దేశంలో ప్రతి వస్తువుకు ప్రభుత్వ క్వాలిటీ చెక్ విధానం ఉండనే విషయం చాలామందికి తెలీదు.

Festival Shopping Tips: పండగకు షాపింగ్ చేస్తున్నారా? అయితే మీరు ముందుగా ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..
Festival Shopping Tips
Follow us on

ఫుడ్ నుంచి బంగారం వరకూ.. షూ నుంచి బట్టల వరకూ.. వాచీల నుంచి పెద్ద టీవీల వరకూ.. కావలసినవి కావాల్సినట్టుగా కొనేసుకోవడం ఎందరో చేస్తుంటారు. ఆన్ లైన్.. ఆఫ్ లైన్ అనే తేడా లేదు షాపింగ్ చేయడం కొంతమందికి ఓ రోజువారీ అలవాటుగా మారిపోయింది. అయితే, షాపింగ్ చేస్తారు కానీ.. కొన్న వస్తువులకు ఎలాంటి క్వాలిటీ చెక్ గురించి పెద్దగా ఆలోచించరు. తమకు తెలిసిన విధానంలో అది బావుందా లేదా అని చూస్తారు.. కొనేస్తారు. కానీ, మన దేశంలో ప్రతి వస్తువుకు ప్రభుత్వ క్వాలిటీ చెక్ విధానం ఉండనే విషయం చాలామందికి తెలీదు. ప్రతి వస్తువుకూ నాణ్యతా ప్రమాణాలను చెక్ చేస్తారు. అలా చెక్ చేసిన వస్తువులకు నాణ్యతను సర్టిఫై చేస్తారు. ఇప్పుడు అసలు మన దేశంలో ప్రోడక్ట్స్ కి క్వాలిటీ చెక్ అలాగే క్వాలిటీ సర్టిఫై విధానాలు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

  1.  ISI మార్క్: ISI అనేది ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థకు స్మాల్ ఫాం. ఇంతకుముందు ISI ని BIS అని పిలిచేవారు. ISI మార్క్ అనేది భారతదేశంలోని పారిశ్రామిక ఉత్పత్తులు నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని రుజువు చేసే గుర్తు. దేశంలోని కొన్ని ప్రొడక్ట్స్ కు ISI గుర్తు తప్పనిసరి. స్విచ్‌లు, ఎలక్ట్రిక్ మోటార్లు, వైరింగ్ కేబుల్స్, హీటర్‌లు, కిచెన్ లో ఉపయోగించే పరికరాలు మొదలైన అనేక ఎలక్ట్రిక్ ఉపకరణాలకు ఇది తప్పనిసరి… పోర్ట్‌ల్యాండ్ సిమెంట్, LPG వాల్వ్‌లు, LPG సిలిండర్లు, ఆటోమోటివ్ టైర్లు మొదలైన ఉత్పత్తులకు కూడా ఇది తప్పనిసరి. ఇతర రకాల ఉత్పత్తులకు ISI గుర్తు ఆప్షనల్ అటువంటి ప్రొడక్ట్స్ అలాగే వాటి ప్యాకెట్లపై ISI గుర్తును చూసిన తర్వాత మాత్రమే మీరు అటువంటి ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేయాలి…
  2. BIS హాల్‌మార్క్ : BIS హాల్‌మార్క్ అనేది భారతదేశంలో అమ్మే బంగారం – వెండి ఆభరణాల కోసం ఒక హాల్‌మార్కింగ్ సిస్టమ్. BIS నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఆభరణాలు హాల్‌మార్క్ చేస్తారు. సర్టిఫై చేసిన ఆభరణాలపై BIS హాల్‌మార్క్ ఉంటుంది…
    అంతేకాకుండా ఆభరణాల స్వచ్ఛత కూడా క్యారెట్‌లో ఇఇస్తారు. ఆభరణాలు కూడా ఆరు-అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్‌ను కలిగి ఉంటాయి. ISI మార్క్ లేదా BIS హాల్‌మార్క్ సరైనదో కాదో BIS పోర్టల్ లేదా BIS కేర్ యాప్‌లో మీ అంత మీరు స్వయంగా చెక్ చేసుకోవచ్చు.
  3. అగ్‌మార్క్: Agmark అనేది భారతదేశంలో అమ్మకానికి ఉంచే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కి ధృవీకరణ గుర్తు. వివిధ ప్రభుత్వ సంస్థలచే నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రోడక్ట్ తాయారు అయిందని ఇది నిర్ధారిస్తుంది. ప్రస్తుత Agmark ప్రమాణంలో 224 విభిన్న వ్యవసాయ వస్తువుల నాణ్యతకు సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయి. ఇవి కాయధాన్యాలు, ఎడిబుల్ ఆయిల్స్, పండ్లు-కూరగాయలు మొదలైన వాటికి సంబంధించినవి.
  4. FPO మార్క్: ఇక చివరగా, FPO మార్క్ గురించి చెప్పుకుందాం. దేశంలో అమ్మే అన్ని ప్రాసెస్ చేసిన పండ్ల ఉత్పత్తులకు ఇది ధృవీకరణ గుర్తు. ప్యాక్ చేసిన పండ్ల పానీయాలు, పండ్ల జామ్‌లు, ఊరగాయలు మొదలైన పండ్లతో తయారు చేసిన అన్ని రకాల ప్రొడక్ట్స్ కు ఈ గుర్తు తప్పనిసరి. ఆ ప్రోడక్ట్ పరిశుభ్రంగా -సురక్షితమైన పద్ధతిలో తయారు అయింది. అలాగే, వినియోగానికి తగినది అని FPO మార్క్ హామీ ఇస్తుంది.

ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలుసుకున్నారు కాబట్టి, ఇకపై మీరు షాపింగ్ చేసినపుడు తప్పనిసరిగా ఈ సర్టిఫైడ్ మార్క్స్ మీ ప్రొడక్ట్స్ పై ఉన్నాయో లేదో చెక్ చేసుకుని తీసుకోండి. క్వాలిటీ వస్తువులనే వినియోగించండి. మీ డబ్బు.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.