ధంతేరస్ పండుగ వేళ 1 గ్రామ్, 2 గ్రామ్స్ గోల్డ్ కొంటుంటే జాగ్రత్త.. ఇది తెలుసుకోకపోతే డబ్బులు కోల్పోతారు..

ఇవాళ ధంతేరస్‌ను పురస్కరించుకుని చాలామంది బంగారం కొంటున్నారు. డబ్బులేనివారు సెంటిమెంట్ కారణంగా అరగ్రాము, ఒక గ్రాము, రెండు గ్రామలు గోల్డ్ కొంటున్నారు. అయితే తక్కువ మోతాదులో బంగారం కొంటుంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు మోసపోయే అవకాశముంటుంది. ఇదెలా అంటే..

ధంతేరస్ పండుగ వేళ 1 గ్రామ్, 2 గ్రామ్స్ గోల్డ్ కొంటుంటే జాగ్రత్త.. ఇది తెలుసుకోకపోతే డబ్బులు కోల్పోతారు..
Gold 1 Gram

Updated on: Nov 06, 2026 | 1:53 PM

ధంతేరస్ వేళ బంగారం కొంటే మంచిదనే నమ్మకంతో శుక్రవారం చాలామంది కొనుగోలు చేస్తున్నారు. తాము కొన్న బంగారాన్ని పూజ గదిలో ఉంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కేవలం బంగారమే కాదు వెండి లాంటి వస్తువులు ఇవాళ కొంటే మంచిదనే నమ్మకంతో కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో రూ.లక్షలు, రూ. వేలు ఖర్చు పెట్టి తీసుకోలేని స్తోమత లేనివారు అరగ్రాము, 1 గ్రాము, రెండు గ్రాముల బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే తక్కువ ధరకే లభించే వెండి గిన్నెలు, పూజా సామాగ్రి, కాయిన్స్ వంటి వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే చిన్న సైజుల్లో కొనుగోలు చేసే గోల్డ్‌కు సంబంధించి చార్జీలు వేరుగా ఉంటాయి. వీటి కోసం తెలుసుకోకపోతే మీరు మోసపోయే అవకాశముంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకసారి చూద్దాం.

బిల్లులో ఈ ఛార్జీలు ఉంటే చెల్లించకండి…

తక్కువ మోతాదులో కొనుగోలు చేసే బంగారానికి హాల్‌మార్క్ ఛార్జీలు ఉండవు. మీరు కొనుగోలు చేసేటప్పుడు ఇచ్చే బిల్లులో హాల్ మార్క్ ఛార్జీలు ఉంటే అసలు కట్టకండి. ఎందుకంటే నిబంధనల ప్రకారం వీటికి హాల్ మార్క్ ఛార్జీలు కట్టాల్సిన పని లేదు. అందుకే బిల్లులో వాటిని యాడ్ చేస్తే తొలగించమని అడగండి. మీకు అవగాహన లేకపోవడం వల్ల వాటిని చెలిస్తే నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే దీనిపై అవగాహన కలిగి ఉండటం మంచిది. రెండు గ్రాముల్లోపు ఉండే గోల్డ్ జ్యూవెలరీ, కాయిన్స్, వస్తువులకు హాల్ మార్క్ ఛార్జీల నుంచి కేంద్రం మినహాయింపు కల్పించింది. బార్లు, నాణేలు, బిస్కెట్లు, వాచ్‌లు, పోల్కి, జడావు, కుందన్, ఫౌంటెన్ పెన్నులు, పూర్తిగా తయారుకాని బంగారు నగలు, వస్తువులు వంటి వాటికి చార్జీల నుంచి బ్యూర్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మినహాయింపు ఇచ్చింది.

హాల్ మార్కింగ్ ఛార్జీలు ఎంత..?

హాల్ మార్కింగ్ ఛార్జీలు ఎలా పడితే అలా షాపుల యజమానులు వసూలు చేయడానికి అనుమతి లేదు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) ధరలను నిర్ణయించింది. యజమానులు ఒక్కో ఆభరణానికి హాల్ మార్క్ కోసం రూ.75 చెల్లించాలి. ఒక కన్సైన్‌మెంట్‌కి కనీస ధర ఛార్జీ రూ.200గా ఫిక్స్ చేశారు. ఈ రుసుంలను కస్టమర్ల నుంచి యజమానులు వసూలు చేస్తున్నారు. 2021లో కేంద్రం బంగారానికి హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది. ఇటీవల హాల్ మార్కింగ్ ఛార్జీలను పెంచారు. రూ.45 నుంచి రూ.75కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2 గ్రాముల లోపు ఉండే ఆభరణాలు, వస్తువులక హాల్ మార్కింగ్ ఛార్జీలు ఉండవు. దీంతో ధంతేరస్‌కు మీరు 1 గ్రాము, 2 గ్రామ్ గోల్డ్ కొంటుంటే ఈ చార్జీల గురించి తెలుసకోండి.

Loading...
Unable to load recommendations.
Follow Us