Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా 4 రోజులు బ్యాంకు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే.?

|

Apr 12, 2022 | 9:34 AM

ఈ వారంలో మీకు బ్యాంక్‌కు వెళ్లే పని ఉందా.? బ్యాంకులో లావాదేవీలు ఏమైనా చేయాలా.? అయితే ఈ అలెర్ట్ మీకోసమే. బ్యాంకు వెళ్లి...

Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా 4 రోజులు బ్యాంకు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే.?
Bank
Follow us on

ఈ వారంలో మీకు బ్యాంక్‌కు వెళ్లే పని ఉందా.? బ్యాంకులో లావాదేవీలు ఏమైనా చేయాలా.? అయితే ఈ అలెర్ట్ మీకోసమే. బ్యాంకు వెళ్లి చేయాల్సిన లావాదేవీలు ఏమైనా ఉంటే.. ఇప్పుడే పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఈ వారంలో నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. అంటే.. మీ పనులు 4 రోజులు పెండింగ్‌లో పడినట్లే. ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 17 వరకు బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో.. అక్కడ జరుపుకోనున్న పండుగలు, ప్రత్యేక రోజుల బట్టి సెలవులు ఉన్నాయి.

ఏప్రిల్ 14:

అంబేద్కర్ జయంతి, మహావీర్ జయంతి, వైశాఖి, తమిళనాడు న్యూ ఇయర్, బిజు ఫెస్టివల్.. మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాలలో ఈ రోజు బ్యాంకులకు సెలవు వర్తిస్తుంది.

ఏప్రిల్ 15:

గుడ్ ఫ్రైడే, బెంగాలీ న్యూ ఇయర్, హిమాచల్ డే.. రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ మినహా మిగతా రాష్ట్రాల్లో ఏప్రిల్ 15న బ్యాంకులు మూసి ఉంటాయి.

ఏప్రిల్ 16:

బొహాగ్ బిహు పండుగ.. అస్సాంలో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి.

ఏప్రిల్ 17:

ఆదివారం.. అన్ని రాష్ట్రాల్లోనూ బ్యాంకులు క్లోజ్

ఇదిలా ఉంటే.. ఏప్రిల్ నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు వచ్చాయి. అయితే ఈ 15 రోజులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలు, ప్రత్యేక రోజుల బట్టి సెలవులు ఉంటాయి.