Home Loan Interest: గృహ రుణాలు, వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచండి.. ప్రభుత్వానికి క్రెడాయ్ విన్నపం..

|

Jan 21, 2024 | 2:13 PM

కేంద్ర బడ్జెట్‌కు సర్వం సిద్ధం అవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1 ఫిబ్రవరి 2024న మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం అనేక కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

Home Loan Interest: గృహ రుణాలు, వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచండి.. ప్రభుత్వానికి క్రెడాయ్ విన్నపం..
Home Loan - Interest
Follow us on

కేంద్ర బడ్జెట్‌కు సర్వం సిద్ధం అవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1 ఫిబ్రవరి 2024న మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం అనేక కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఈ తరుణంలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) కీలక ప్రకటన చేసింది. గృహరుణాలు, వడ్డీ చెల్లింపులపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (CREDAI) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వచ్చే నెల 1న ప్రవేశ పెడుతున్న తాత్కాలిక బడ్జెట్‌లో ఈ మేరకు ప్రతిపాదనలు చేయాలంటూ క్రెడాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనివల్ల స్థిరాస్తి రంగం వృద్ధికి అవకాశాలు పెరుగుతాయని పలు వివరాలతో సూచనలు చేసింది.

ప్రస్తుతం గృహరుణానికి చెల్లిస్తున్న అసలుకు సెక్షన్‌ 80సీ పరిమితి రూ.1,50,000 మేరకు వినియోగదారులకు పన్ను మినహాయింపు లభిస్తోంది. చెల్లించిన వడ్డీకి సెక్షన్‌ 24(బి) ప్రకారం రూ.2 లక్షల వరకూ మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. అయితే, పాత పన్నుల విధానంలో రిటర్నులు దాఖలు చేయాలనుకునే వారే ఈ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోగలరు. ఈ ప్రతిపాదనల్లో భాగంగా.. గృహరుణం అసలు చెల్లింపు మొత్తానికి ప్రత్యేక ప్రామాణిక తగ్గింపులను వర్తింపజేయాలంటూ క్రెడాయ్ ప్రతినిధులు కోరారు.

2017లో అందుబాటు గృహాల విలువను రూ.45 లక్షలుగా నిర్ణయించినట్లు క్రెడాయ్ తెలిపింది. పెరిగిన ద్రవ్యోల్బణం, గత ఏడేళ్లుగా స్థిరాస్తి ధరల్లో పెరుగుదల తదితరాల నేపథ్యంలో ఇది ఏమాత్రం సరిపోదని వివరించింది. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (NHB) లెక్కలు, వివరాల ప్రకారం 2018 నుంచి ఇళ్ల ధరల్లో 24 శాతం పెరిగాయని వెల్లడించింది. కావున ఈ విలువను ప్రస్తుత మార్కెట్ కు అనుగుణంగా సవరించాలని పేర్కొంది.

ప్రస్తుతం వడ్డీపై ఇస్తున్న మినహాయింపు మొత్తాన్ని రూ.5 లక్షలు చేయాలని, దీనివల్ల సొంతిల్లు కొన్న వారికి ఊరట లభిస్తుందని క్రెడాయ్ అధ్యక్షుడు బొమన్‌ ఇరానీ తెలిపారు. స్థిరాస్తి రంగం జీడీపీ, ఉద్యోగాల కల్పన, మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఎంతో తోడ్పడుతుందని, దీనికి ప్రభుత్వ చేయూత అవసరం అంటూ వివరించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..