
మీకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉందా..? ఇంట్లో సిలిండర్ వాడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే. మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాల్సిందే. ప్రతీ ఏడాది ఒకసారి ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఒకవేళ మీరు ఇప్పటికీ చేయకపోతే వెంటనే పూర్తి చేయండి. లేకపోతే గ్యాస్ సిలిండర్ పొందటంలో మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ గ్యాస్ బుకింగ్ సేవలు కూడా నిలిచిపోయే అవకాశముంది. ఇక ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీ, రాయితీల సొమ్ము బంద్ అవుతుంది. అయితే ఈ ప్రాసెస్ పూర్తి చేయడానికి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే మొబైల్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం అందుబాటులో ఉంది. అదెలా అంటే..
-గూగుల్‌లోకి వెళ్లి www.mylpg.in అని టైప్ చేయండి.
-ఆ తర్వాత మై ఎల్పీజీ పేరుతో వచ్చే వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
-ఇక పోర్టల్‌లో మీ 17 అంకెల ఎల్పీజీ ఐడీని ఎంటర్ చేయండి
-ఆ తర్వాత మీరు ఏ కంపెనీ గ్యాస్ వాడుతున్నారో.. ఆ కంపెనీ గ్యాస్ సిలిండర్‌పై క్లిక్ చేయండి
-కొత్త విండోలోసైన్ ఇన్, న్యూ యూజర్ అనే ఆప్షన్లు ఉంటాయి
-మీరు ఇంతకముందే రిజిస్టర్ చేసుకుని ఉంటే సైన్ ఇన్ చేయండి
-ఒకవేళ ఇంతకముందు రిజిస్టర్ చేసుకోకపోతే న్యూ యూజర్‌పై క్లిక్ చేయండి
-గ్యాస్ కన్జూమర్ నెంబర్, ఇతర వివరాలు నమోదు చేయండి
-ఆ తర్వాత గ్యాస్ కనెక్షన్ ఐడీ నెంబర్‌తో లాగిన్ అయితే మీ కనెక్షన్ వివరాలు అన్నీ కనిపిస్తాయి
-ఆ తర్వాత ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకోండి
-ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి
-మొబైల్ నెంబర్‌కు వచ్చే ఆధార్ ఓటీపీని నమోదు చేయండి
-ఆ తర్వాత మీరు విజయవంతంగా ఈకేవైసీ పూర్తి చేసినట్లు మెస్సేజ్ కనిపిస్తుంది
ఒకవేళ మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలంటే.. ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్‌పై మళ్లీ క్లిక్ చేయండి. మీరు ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేశారనే మెస్సేజ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అది కనిపిస్తే మీ కేవైసీ కంప్లీట్ అయినట్లే. ఇక ఆఫ్‌లైన్‌లో పూర్తి చేయాలంటే.. మీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి ఆధార్ వివరాలు సమర్పించి పూర్తి చేసుకోవచ్చు. ఇక డెలివరీ బాయ్ దగ్గర ఉండే మెషిన్ ద్వారా కూడా చేయవచ్చు.