సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలని ప్లాన్‌ ఉందా.? ఈ 5 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి..!

కొత్త కార్ల మాదిరిగానే సెకండ్ హ్యాండ్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఆఫ్‌లైన్ మార్కెట్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా సెకండ్ హ్యాండ్ కార్లు మంచి కండిషన్‌లో ఉంటాయి. అంతేకాకుండా మంచి ఫీచర్లతో సరసమైన ధరలో లభిస్తాయి. ఆ వివరాలు

సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలని ప్లాన్‌ ఉందా.? ఈ 5 విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి..!

Updated on: Jan 19, 2025 | 3:00 PM

కొత్త కార్ల మాదిరిగానే సెకండ్ హ్యాండ్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఆఫ్‌లైన్ మార్కెట్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా సెకండ్ హ్యాండ్ కార్లు మంచి కండిషన్‌లో ఉంటాయి. అంతేకాకుండా మంచి ఫీచర్లతో సరసమైన ధరలో లభిస్తాయి. అయితే సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసేటప్పుడు కొన్ని అంశాలని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. లేదంటే మోసం జరిగే అవకాశాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

కారు డాక్యుమెంట్లు:

సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసే ముందు ఆ వాహనం పేపర్‌లను తనిఖీ చేయండి. ఛాసిస్, ఇంజిన్ నంబర్‌లను చెక్ చేయండి. ఇన్సూరెన్స్‌ పత్రాలు మొదలైనవాటిని క్షణ్ణంగా పరిశీలించాలి. వీలైతే కారు ఫిల్టర్‌లు మొదలైనవాటిని కూడా చూడాల్సి ఉంటుంది.

కారు ఇంజిన్‌:

కారు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి దాని పెయింట్, కండిషన్‌ మాత్రమే కాదు ఇంజిన్ పనితీరు చాలా ముఖ్యం. అందుకే కారు ఇంజిన్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. అవసరమైతే మెకానిక్ సహాయం తీసుకోవచ్చు.

బూట్ స్పేస్, బానెట్‌ను చెక్ చేయండి:

కారు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కారు బూట్ స్పేస్, బానెట్‌ను ఓపెన్‌ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కారు ఏమైనా డ్యామేజ్‌ అయితే లోపల చూడటం ద్వారా తెలుస్తుంది.

టైర్ల పరిస్థితిని చెక్‌ చేయండి:

కారు టైర్లపై ఓ లుక్కేయండి. తరచుగా సెకండ్ హ్యాండ్ కార్లలో చాలా మంది సెకండ్‌ హ్యాండ్‌ కార్లని అమర్చుతారు. ఎందుకంటే కొత్త టైర్ల కోసం దాదాపు 20 వేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది.

కొన్ని కిలోమీటర్ల వరకు డ్రైవ్‌ చేయండి:

సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసే ముందు అది పాత కారని మరిచిపోకండి. ఇంజిన్‌లో సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కారును కొన్ని కిలోమీటర్ల దూరం నడపడం ముఖ్యం. కారును 100 వేగంతో నడపాలని గుర్తుంచుకోండి. అప్పుడే ఏమైనా సమస్యలు ఉంటే బయటపడతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి