
రాబోయే కేంద్ర బడ్జెట్ రైతుల ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావచ్చు. కేంద్ర ప్రభుత్వం తన అత్యంత ప్రతిష్టాత్మక పథకాలలో ఒకటైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM కిసాన్ యోజన) మొత్తాన్ని గణనీయంగా పెంచాలని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆలోచన ప్రకారం అంతా జరిగితే రైతులకు ఒక నుంచి రూ.6,000 నుండి రూ.9,000 లేదా అంతకంటే ఎక్కువకు పెరగవచ్చు.
రాబోయే ఆర్థిక సంవత్సరం 2026-27 కోసం బడ్జెట్‌ను తయారు చేసే సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బహుళ-స్థాయి ప్రక్రియ. ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో వరుస సమావేశాలు ప్రారంభమవుతాయి. నీతి ఆయోగ్, సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రతినిధులు, వ్యవసాయ రంగంలోని అన్ని వాటాదారులతో సంప్రదింపులు జరుగుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 కింద తయారు చేయబడిన ఈ వార్షిక ఆర్థిక నివేదిక, రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం ప్రజా నిధులను ఎక్కడ, ఎలా ఖర్చు చేస్తుందో నిర్ణయిస్తుంది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించినప్పటి నుండి, రైతులకు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎరువులు, విత్తనాలు, డీజిల్ ధరలు పెరిగినప్పటికీ సమ్మాన్ నిధి మొత్తం మారలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి