Cash Withdrawal: గూగుల్‌ పే, పేటీఎంతో ఏటీఎమ్‌ నుంచి మనీ విత్‌ డ్రా.. పూర్తి ప్రాసెస్‌ తెలుసుకోండి..!

Cash Withdrawal: ఏటీఎం కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించి ఏటీఎం నుంచి డబ్బు విత్‌ డ్రా చేయవచ్చు. కానీ ఇప్పుడు పేటీఎం, గూగుల్‌ పే ఉపయోగించి

Cash Withdrawal: గూగుల్‌ పే, పేటీఎంతో ఏటీఎమ్‌ నుంచి మనీ విత్‌ డ్రా.. పూర్తి ప్రాసెస్‌ తెలుసుకోండి..!
Upi Money

Updated on: May 19, 2022 | 9:17 PM

Cash Withdrawal: ఏటీఎం కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించి ఏటీఎం నుంచి డబ్బు విత్‌ డ్రా చేయవచ్చు. కానీ ఇప్పుడు పేటీఎం, గూగుల్‌ పే ఉపయోగించి కూడా మనీ విత్‌ డ్రా చేయవచ్చు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఏటీఎం కార్డు, డెబిట్ కార్డ్ లేకుండా ఏటీఎం నుంచి డబ్బును విత్‌డ్రా చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. QR కోడ్ ద్వారా ఇది జరుగుతుంది. ఈ కొత్త సేవలో ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా చేసుకోవడానికి కస్టమర్‌కు డెబిట్ కార్డ్ అవసరం లేదు. పిన్ నెంబర్‌ లేదా పాస్‌వర్డ్‌ గుర్తుంచే చాలు. మీ ఫోన్‌లో ఏదైనా UPI చెల్లింపు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ UPI యాప్ మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి. మీ ఫోన్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. తర్వాత మీరు ఏటీఎం కార్డ్ నుంచి డబ్బును సులభంగా తీసుకోగలరు. అది ఎలాగో తెలుసుకుందాం.

1. ఏదైనా ఏటీఎంకి వెళ్లి మనీ విత్‌డ్రా ఎంపికను ఎంచుకోండి.

2. ఏటీఎం మెషీన్ స్క్రీన్‌పై యూపీఐ ఎంపిక కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

3. ఏటీఎం స్క్రీన్‌పై QR కోడ్ కనిపిస్తుంది.

4. మీ ఫోన్‌లో UPI చెల్లింపు యాప్‌ని ఓపెన్‌ చేసి దాని QR కోడ్ ఎంపికకు వెళ్లండి.

5. కోడ్‌ని స్కాన్ చేసి విత్‌ డ్రా చేయాలనుకుంటున్న అమౌంట్‌ ఎంటర్ చేయండి.

6. UPI పిన్‌ని నమోదు చేయండి. దీని కోసం మీరు ‘హీట్ ప్రొసీడ్’ బటన్‌పై క్లిక్ చేయాలి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us