
EV Chaging Plug In: సొంత ఇల్లు ఉన్నవారికి ఎలక్ట్రిక్ వాహనం (EV) ఛార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకోవడం సులభమే కావచ్చు. కానీ, అపార్ట్‌మెంట్లు, హౌసింగ్ సొసైటీలలో ఉండేవారికి ఇది కొంత సంక్లిష్టమైన విషయం. ఈవీని కొనుగోలు చేసే ముందే మీ ఇంటి ఎలక్ట్రిసిటీ లోడ్ (Power Load), బిల్డింగ్ విద్యుత్ వ్యవస్థ సామర్థ్యాన్ని తనిఖీ చేయడం ఎంతో అవసరం.
ఇది కూడా చదవండి: Insurance Claim: వాహనదారులకి ఊరటనిచ్చే తీర్పు.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు!
ఈవీ ఛార్జర్‌ను కేవలం ఒక సాధారణ హోమ్ అప్లయన్స్‌లా పరిగణించవద్దని, ఛార్జర్ బిగించడం సులభమే కావచ్చు, కానీ లోపల ఉన్న ఎలక్ట్రికల్ నెట్‌వర్క్‌ను పునర్నిర్మించడానికి ఎక్కువ సమయం, ఖర్చు కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రత్యేక వైరింగ్, భద్రత: కారు ఛార్జింగ్ కోసం నాణ్యమైన వైరింగ్, సరైన MCB, RCCB ప్రొటెక్షన్ సిస్టమ్‌లను ఉపయోగించాలి. BIS లేదా సర్టిఫైడ్ కంపెనీల ఛార్జర్లను మాత్రమే అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్ ద్వారా అమర్చుకోవాలి. అలాగే ఎక్స్‌టెన్షన్ బాక్స్‌లు లేదా తాత్కాలిక వైరింగ్ ద్వారా గంటల తరబడి ఛార్జింగ్ చేయడం ప్రమాదకరం.
అపార్ట్‌మెంట్లలో ఒకేసారి అందరూ ఛార్జింగ్ పెట్టినప్పుడు విద్యుత్ గ్రిడ్‌పై భారం పడకుండా ఉండటానికి స్మార్ట్ ఛార్జింగ్ విధానం ఉపయోగపడుతుంది. దీని ద్వారా అందరి వాహనాలకు ఒకే సమయంలో కాకుండా, లభ్యతలో ఉన్న పవర్ ఆధారంగా విడతల వారీగా విద్యుత్ సదుపాయం అందుతుంది.
ఇది కూడా చదవండి: House Construction: ఇంటి స్లాబ్‌పై లక్షలోపే రేకుల ఇల్లు నిర్మాణం.. దేనికి ఎంత ఖర్చు..!
ఇది కూడా చదవండి: Gold Price Today: రికార్డ్ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులోనే ఎంత తగ్గిందో తెలిస్తే షాకవుతారు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి