Bumper Offer: ప్రస్తుతం వివిధ ఈ-కామర్స్ దిగ్గజాలతో పాటు ఇతర మొబైల్ స్టోర్‌లలో కూడా స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు పెరుగుతుండటంతో వారిని మరింతగా ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ వంటివి ప్రవేశపెడుతున్నాయి. ఇక ప్రముఖ ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సెలెక్ట్ మొబైల్స్ (Celekt mobiles)తమ 4వ వార్షికోత్సవ సందర్భంగా కస్టమర్లకు ఆఫర్లను ప్రకటించింది. నోకియా 43 అంగుళాల ఎల్‌ఈడీ 4కే స్మార్ట్ టీవీ ధర రూ.22,999గానే పేర్కొన్నది. ఇక 55 అంగుళాల టీవీ ధర రూ.32,999గా, 65 అంగుళాల టీవీ ధర రూ.49,999గా తెలిపింది. అలాగే ప్రతి మొబైల్ కొనుగోలుపై ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్‌ను అందిస్తున్నట్లు సెలెక్ట్ మొబైల్ తెలిపింది. ఇక విద్యార్థుల కోసం ప్రముఖ బ్రాండెడ్ వాచీలను రూ.1,799 ప్రారంభ ధరకే అందుబాటులో ఉంచింది.
మొబైల్ ఫోన్ల ఎక్సేంజ్ ఆఫర్..
ఇక మొబైల్ ఫోన్ల ఎక్సేంజ్ ఆఫర్, యాక్ససరీస్‌పై 80 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. అలాగే జెస్ట్ మనీ ద్వారా మొబైల్ కొనుగోళ్లపై ఒక ఈఎంఐ ఉచిత ఆఫర్ ఉంటుందని ఈ సందర్భంగా సంస్థ సీఎండీ వై గురు తెలిపారు. ఇతర ఫైనాన్స్‌ల్లోనూ మొబైల్ ఫోన్లను ఆకర్షణీయ ఆఫర్లు, ధరలకే కొనుక్కోవచ్చన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో 83 స్టోర్లను కలిగి ఉన్న ఈ కంపెనీ.. త్వరలోనే 100 స్టోర్ల మైలురాయిని చేరాలని భావిస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి