Budget 2024: బడ్జెట్‌లో గృహిణులు కోరుకుంటోంది ఇదే!
గత బడ్జెట్‌లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ను ప్రకటించిన సంగతి మహిళలకు గుర్తుకు వస్తోంది. ఈ రెండేళ్ల పెట్టుబడి పథకంలో 7.5 శాతం వడ్డీ వస్తుంది. ఈ పథకంలో చాలా మంది ఒక్క పైసా కూడా జమ చేయలేకపోయారని బాధపడుతున్నారు. ఈసారి బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు అవసరమైన లాజిస్టిక్స్ ను అందుబాటు ధరలో ప్రభుత్వం అందజేయాలని మహిళలు కోరుతున్నారు. అలాగే కిసాన్ సమ్మాన్ నిధి వంటి..
బడ్జెట్ సమావేశాల సమయం మరింత దగ్గర పడుతోంది. సామాన్యుడి నుంచి ధనికుడి వరకు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చేస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో మధ్యంత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాల వారు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ఈ మధ్యంత బడ్జెట్‌లో ఎలాంటి హామీలు ఇస్తారు..? ఎలాంటి ప్రకటనలు చేస్తారోనని ఎదురు చూస్తున్నారు. ఇక మహిళలు కూడా ఈ బడ్జెట్ గురించి ఎదురు చూస్తున్నారు . కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ మహిళల కోసం ఏవైనా ప్రకటనలు చేస్తారోనని ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో వంటగది బడ్జెట్ పెరిగిపోయింది. ఇంటి ఖర్చులు పెరిగిపోతున్నాయి.
భారత్ బ్రాండ్ పేరుతో పిండి, పప్పులు, బియ్యం విక్రయించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నం ఇది. కానీ ఇదంతా కాలే పెనంపై వేడి నీళ్లు జల్లడమే అన్నట్టు ఉంది. గత బడ్జెట్‌లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ ను ప్రకటించిన సంగతి మహిళలకు గుర్తుకు వస్తోంది. ఈ రెండేళ్ల పెట్టుబడి పథకంలో 7.5 శాతం వడ్డీ వస్తుంది. ఈ పథకంలో చాలా మంది ఒక్క పైసా కూడా జమ చేయలేకపోయారని బాధపడుతున్నారు. ఈసారి బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు అవసరమైన లాజిస్టిక్స్ ను అందుబాటు ధరలో ప్రభుత్వం అందజేయాలని మహిళలు కోరుతున్నారు. అలాగే కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకం ప్రారంభించాలి. గృహిణులకు నేరుగా సహాయం అందించేలా ఇది ఉండాలని భావిస్తున్నారు. మరి ఇంకా ఎలాంటివి కోరుకుంటున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి