
BSNL Vi Partnership: టెలికాం రంగంలో ప్రభుత్వ రంగానికి చెందిన BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) మరియు ప్రైవేట్ దిగ్గజం Vodafone Idea (Vi) చేతులు కలిపాయి. ఈ రెండు కంపెనీల మధ్య జరిగిన కీలకమైన ‘నెట్‌వర్క్ షేరింగ్ ఒప్పందం’ (ICR – Intra Circle Roaming) వల్ల నెట్‌వర్క్ కవరేజ్ మరింత బలోపేతం కానుంది. ఈ భాగస్వామ్యంతో యూజర్లకు మెరుగైన కవరేజ్ లభించడమే కాకుండా BSNL 5G సేవల రాకకు దారి సుగమం కానుందా అనే చర్చ ప్రారంభమైంది.
ఇది కూడా చదవండి: House Construction: ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ 9 తప్పులు చేయకపోతే మీ భవనం నూరేళ్లు పదిలం!
ఇది కూడా చదవండి: House Construction Guide: ఇల్లు కడుతున్నారా? ఎలాంటి ఇటుక వాడాలి? ఈ పొరపాటు చేస్తే అంతే..!
ఈ నెట్‌వర్క్ షేరింగ్ డీల్ వల్ల BSNL 5G వేగవంతం కానుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం BSNL దేశవ్యాప్తంగా తన 4G నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఈ 4G టవర్లను త్వరలోనే 5G కి అప్‌గ్రేడ్ చేసే విధంగా స్వదేశీ సాంకేతికతతో రూపకల్పన చేస్తున్నారు.
Vi ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 5G ట్రయల్స్, విస్తరణపై దృష్టి పెట్టడంతో ఈ భాగస్వామ్యం ద్వారా BSNL కూడా తన యూజర్లకు త్వరలోనే 5G అనుభవాన్ని అందించేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.
ఇది కూడా చదవండి: House Wiring: హౌస్ వైరింగ్‌లో ఏది సేఫ్? కాపర్ లేదా అల్యూమినియం వైర్ల మధ్య తేడాలివే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి