
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL తమ కష్టమర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తమ కొత్త యూజర్స్ కోసం BSNL తమ పాత ప్రీడ్ ప్లాన్..ఫ్రీడమ్ 2.0 పేరుతో మళ్లీ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద బీఎస్‌ఎన్‌ఎల్ కేవలం రూ.1కే సిమ్ అందించడంతో పాటు ఫస్ట్ రీఛార్జ్‌ను కూడా పూర్తి ఉచితంగా అందిస్తోంది. మీరు రూ.1కి పెట్టి కొత్త బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌ను కొంటే.. 24 రోజుల పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు, 1GB డేటా పొందవచ్చు.
కొత్త యూజర్స్‌కు మాత్రమే ఛాన్స్
అయితే ఈ ఆఫర్‌కు బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ టైమ్ లిమిట్‌ను కూడా పెట్టింది. సెప్టెంబర్ 12లోపు కొత్త సిమ్ కొనేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని BSNL పేర్కొంది. అంతేకాదు కంపెనీ ఈ ఆఫర్‌లో మరో కీలక సూచన కూడా చేసింది. ఈ ఆఫర్ పూర్తిగా కొత్త యూజర్స్‌కు మాత్రమేనని.. పాత వినియోగదారులకు వర్తించదని స్పష్టం చేసింది.
పాత యూజర్స్ కోసం మరో ఆఫర్
ఇదిలా ఉండగా పాత యూజర్స్‌కు కూడా BSNL శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు ఉన్న రూ.2,399 వార్షిక ప్లాన్ వాలిడిలీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.2,399 పెట్టి రిఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిలీ వచ్చేది.కానీ ఇప్పుడు దీనికి మరో 47 రోజుల యాడ్ చేసింది. దీంతో యూజర్స్ వార్షిక ప్లాన్ తీసుకుంటే మొత్తం వ్యాలిడిటీ 412 రోజులు వస్తుంది. అయితే ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు రీఛార్జ్ చేసుకునే యూజర్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని BSNL స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.