Recharge: జస్ట్ రూ.1 చెల్లిస్తే చాలు.. అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్ సౌకర్యం.. పండుగ ఆఫర్ వచ్చేసింది..

బీఎస్ఎన్‌ఎల్ మరో భారీ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. అదే రూ.1కే ఫ్రీడమ్ ఆఫర్. ఇందులో భాగంగా రూ.1కే సిమ్ కార్డు పొందవచ్చు. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు ఇంటర్నెట్ సౌకర్యం కూడా పొందవచ్చు. కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్‌లోకి మారేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Recharge: జస్ట్ రూ.1 చెల్లిస్తే చాలు.. అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్ సౌకర్యం.. పండుగ ఆఫర్ వచ్చేసింది..
Bsnl

Updated on: Oct 04, 2026 | 3:05 PM

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) భారీ శుభవార్త అందించింది. ఫ్రీడమ్ 2.0 పేరుతో సరికొత్త భారీ బంపర్ ఆఫర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చింది. బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ 2.0 పేరుతో ఈ ఆఫర్ లాంచ్ చేసింది. కేవలం అక్టోబర్ 12వ తేదీ వరకు మాత్రమే ఇది అందుబాటులోకి ఉంటుంది. అప్పటిలోగా మీరు సిమ్ పొందితే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా కేవలం రూ.1కే సిమ్ కార్డు అందిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్.. దానితో పాటు 24 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే విధంగా ఉచిత అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తోంది.

రూ.1కే అన్‌లిమిటెడ్ కాల్స్

అన్‌లిమిటెడ్ కాల్స్‌ దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా చేసుకోవచ్చు. కొత్తగా వేరే నెట్‌వర్క్ నుంచి బీఎస్‌ఎన్‌లోకి మారేవారు, కొత్తగా సిమ్ తీసుకునేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ ఉపయోగిస్తున్నవారికి ఈ ఆఫర్ వర్తించదు. కొత్త కస్టమర్లను తమ నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. అలాగే ఉచిత కాల్స్‌తో పాటు రోజుకు 1 జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ కూడా ఈ ప్లాన్‌తో వస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా చేసుకోవచ్చు. 24 రోజుల పాటు ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఉంటుంది. అక్టోబర్ 12లోపు కొత్తగా సిమ్ కొనుగోలు చేసేవారికి లేదా బీఎస్‌ఎన్‌ఎల్‌లోకి పోర్ట్ అయ్యేవారికి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ ఆఫర్ అందుబాటులో ఉండదు. మీ సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల సేవా కేంద్రానికి వెళ్లి ఈ ఆఫర్ పొందవచ్చు. అలాగే గుర్తింపు పొందిన రిటైలర్ వద్ద కూడా అందుబాటులో ఉంటుంది. ఆధార్, మీ కేవైసీ వివరాలు అందిస్తే సిమ్ యాక్టివేట్ అవుతుంది. బీఎస్ఎన్ఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1800- 180- 1503 లేదా బీఎస్ఎన్ఎల్ న్యూ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

ఇంటర్నెట్ కూడా..

రూ.1కే సిమ్‌తో పాటు  24 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్ అంటే అత్యంత చవకైన ప్లాన్‌గా చెప్పవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త కస్టమర్లను ఆక్టటుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇతర టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను భారీగా పెంచేశాయి. కానీ బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌లోకి చాలామందికి మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటివారిని ఆకర్షించే పనిలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ అనేక ఆఫర్లను తీసుకొచ్చింది. కొత్తగా సిమ్ తీసుకునేవారికి చౌక ధరకే ప్లాన్లను తీసుకొస్తుంది. గతంలో పండుగల సమయంలో ఫ్రీడమ్ ఆఫర్లను తీసుకురాగా.. త్వరలో దసరా, దీపావళి పండగలు వస్తున్న క్రమంలో మరోసారి ఫ్రీడమ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Loading...
Unable to load recommendations.
Follow Us