
ఏపీలో ఫార్మసీ చదివిన విద్యార్థులకు మంచి ఛాన్స్. మీ ఊర్లో ఉండే వ్యాపారం స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాకారం అందించనున్నాయి. బీఫార్మసీ లేదా డిప్లోమా ఇన్ ఫార్మసీ చేసిన విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పశు ఔషధీ స్కీంను ప్రారంభించింది. ఈ పథకాన్ని ఏపీలోనూ అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ఫార్మసీ విద్యార్థులు ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి..? ఇందుకు కావాల్సిన అర్హతలు ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎంతవరకు సంపాదించుకోవచ్చు? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పశువులకు ఉపయోగించే లేదా కావాల్సిన మందులను విక్రయించి డబ్బులు సంపాదించుకోవచ్చు. పశు పోషణను ప్రోత్సహించేందుకు పాడి రైతులకు తక్కువ ధరకే జనరిక్ మందులను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ మందులను అందించేందుకు దేశంలో పశు ఔషధీ కేంద్రాల ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రాల ఏర్పాటులో ఫార్మసీ విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తోంది. విద్యార్థులు తమ పట్టణం లేదా గ్రామంలో వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వం సహాయం కూడా అందిస్తోంది. ఫార్మసీ చదువుకున్న విద్యార్థులు స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పిస్తోంది. విద్యార్థులు దరఖాస్తు చేసుకుని లబ్ది పొందాలని చెబుతోంది.
-బీఫార్మసీ, డిప్లోమా ఇన్ ఫార్మసీ చేసి తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి
-స్టేట్ ఫార్మా కౌన్సిల్‌లో ఫార్మసిస్టుగా రిజిస్ట్రర్ అయి ఉండాలి
-డ్రగ్ కంట్రోల్ అథారిటీ నుంచి డ్రగ్ సేల్ లైనెన్స్ కలిగి ఉండాలి
-120 చదరపు విస్తీర్ణంలో షాపు కలిగి ఉండాలి
అ-ద్దెకు తీసుకున్న షాప్ అయినా పర్లేదు
-కేంద్ర ప్రభుత్వం 20 శాతం వరకు ఆపరేటింగ్ మార్జిన్ ఇన్సెంటివ్ సాయం అందిస్తోంది
-10 శాతం నెలవారీ కొనుగోళ్లపై ఇన్సెంటివ్
-స్మార్ట్ నిర్వహణ ఆధారంగా మరో 10 శాతం ఇన్సెటివ్
-ఫార్మాసిటికల్ అండ్ మెడికల్ డివైస్ బ్యూరో ఆఫ్ ఇండియా ద్వారా జనరిక్ మెడిసిన్ సరఫరా
-https://pashuaushadhi.dahd.gov.in/login.do వెబ్‌సైట్‌కి వెళ్లండి
-రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయండి
-పేరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్ వివరాలతో లాగిన్ అవ్వండి
-ఆ తర్వాత అప్లికేషన్ ఫారం పూర్తి చేయండి
-మీ ఎడ్యుకేషన్, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించండి
ఆన్‌లైన్ ఫీజు రూ.5 వేలు చెల్లించండి
-అనంతరం సబ్మిట్ చేయండి
-మీ అప్లికేషన్ స్టెటస్‌ను ఈ వెబ్‌సైట్‌లోని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు