
ఫ్యూచర్ గ్రూపు రిటైల్ చైన్ బిగ్ బజార్ భారీ ఆఫర్ ప్రకటించింది. షాపింగ్ చేసిన కస్టమర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. రూ.1500 విలువైన షాపింగ్ చేసిన కస్టమర్లకు రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ చేస్తామని వెల్లడించింది. ఈనెల 22న మొదలైన ఈ ఆఫర్ 31వ తేదీతో ముగియనుందని కంపెనీ తెలిపింది. అయితే రూ.1000 క్యాష్‌బ్యాక్‌తో పాటు రెండు గంటల్లోనే ఉచిత హోండెలివరీ అందిస్తామని తెలిపింది.
కస్టమర్లు ఇంటి వద్ద నుంచే బిగ్‌బజార్ యాప్, ఆన్లైన్ స్టోర్ నుంచి కూడా ఈ ఆఫర్ కింద కొనుగోలు చేయవచ్చని తెలిపింది. కోవిడ్-19 మార్గదర్శకాలను అనుసరిస్టూ కస్టమర్లు తమ సమీప స్టోర్‌లోనూ కొనుగోలు చేయవచ్చని గ్రూప్ సీఎంఓ, డిజిటల్ మార్కెటింగ్ పవన్ సర్థా పేర్కొన్నారు.