
LPG Gas: మీరు మీ వంటగదిలో ఎల్‌పిజి సిలిండర్‌ను ఉపయోగిస్తుంటే ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ ఎల్‌పిజి సిలిండర్ అకస్మాత్తుగా అయిపోయి, మరో సిలిండర్ కొనడానికి మీ దగ్గర డబ్బులు లేకపోతే, భారత్ గ్యాస్ మైక్రోఫైనాన్స్ సౌకర్యం మీకు సహాయపడగలదు. ఎల్‌పిజి రీఫిల్ కోసం మీరు ఇప్పుడు రూ.600 వరకు మైక్రో-లోన్ తీసుకోవచ్చని, ఆ మొత్తాన్ని సులభమైన, వడ్డీ లేని వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చని భారత్ పెట్రోలియం ఎల్‌పిజి తన అధికారిక వేదిక అయిన ‘X’లో ఒక పోస్ట్‌లో ప్రకటించింది.
ఈ పథకంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు వెంటనే ఒకేసారి పెద్ద మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా 600 రూపాయల మొత్తాన్ని 100 రూపాయల చొప్పున ఆరు వారపు వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. అంటే ఈ విధంగా మొత్తం 600 రూపాయలను చేరుకోవచ్చు. పోస్టర్‌లో అందించిన సమాచారం ప్రకారం, ఈ సౌకర్యం BNPL (ఇప్పుడే కొనండి, తర్వాత చెల్లించండి) నమూనాపై ఆధారపడి ఉంటుంది.
ఇది కూడా చదవండి: House Construction: కేవలం ఒక సెంట్ స్థలంలో రూ. 4 లక్షల బడ్జెట్‌లోనే ఇల్లు నిర్మాణం..!
रसोई की ज़रूरतें अब आर्थिक चिंता से नहीं रुकेंगी।
उपलब्ध सूक्ष्म-वित्तीय (माइक्रोफाइनेंस) सुविधा का लाभ उठाकर भारतगैस रिफिल अभी लें, भुगतान बाद में करें
अधिक जानकारी के लिए अपने भारतगैस वितरक से संपर्क करें।
#Bharatgas #BPCL #BuyNowPayLater #LPG #FuellingPossibilities
@PetroleumMin @HardeepSPuri @neerajmittalias @Secretary_MoPNG @BPCLimited @DirectorM_BPCL @cmdbpcl
— Bharat Petroleum LPG (@BPCLLPG) September 24, 2026
ఉదాహరణకు మీకు అకస్మాత్తుగా ఒక ఎల్‌పిజి సిలిండర్ అవసరమై, దానికోసం రూ.600 కావాలి అనుకుందాం.. కానీ ఆ సమయంలో మీ దగ్గర పూర్తి మొత్తం లేదు. అయినప్పటికీ, మీరు ఈ మైక్రోఫైనాన్స్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే, మీరు మీ భారత్‌గ్యాస్ పంపిణీదారుని సంప్రదించవలసి ఉంటుంది. అక్కడ మీరు లభ్యత, అర్హత, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.
ఇది కూడా చదవండి: Smaratphone Prices: స్మార్ట్‌ఫోన్లు కొనే వారికి షాకింగ్ న్యూస్.. ఇక మీ జేబుకు చిల్లులే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి