Summer Business Ideas: ఎండలు మండుతున్నాయని భయపడకండి.. ఈ 5 బిజినెస్ ఐడియాలతో మీ జేబులు నింపుకోండి

మార్చి నెల ముగియకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. 2026 వేసవి ఎండలు రికార్డు స్థాయికి చేరుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే, ఈ ఎండలను సాకుగా చూపకుండా, ప్రజల అవసరాలను గుర్తించి చిన్నపాటి వ్యాపారాలు ప్రారంభిస్తే భారీగా లాభాలు గడించవచ్చు. ముఖ్యంగా దాహార్తిని తీర్చే పానీయాలు, చల్లదనాన్ని ఇచ్చే వస్తువులకు ఈ మూడు నెలలు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

Summer Business Ideas: ఎండలు మండుతున్నాయని భయపడకండి.. ఈ 5 బిజినెస్ ఐడియాలతో మీ జేబులు నింపుకోండి
Profitable Summer Business Ideas Telugu

Updated on: Mar 31, 2026 | 11:20 AM

తక్కువ పెట్టుబడితో గరిష్ట లాభాలు ఇచ్చే వ్యాపారాలు ఏవి? కేవలం పార్ట్ టైమ్ చేస్తూనే రోజుకు రూ. 1000 నుండి రూ. 3000 వరకు ఎలా సంపాదించవచ్చు? పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా క్లిక్ అయ్యే ఆ ‘ఎవర్ గ్రీన్’ సమ్మర్ బిజినెస్ మోడల్స్ ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం…

నేచురల్ ఫ్రూట్ జ్యూస్, మజ్జిగ కేంద్రం:

ఎండలో తిరిగే వారికి ముందుగా గుర్తొచ్చేది చల్లని పానీయం. ఖరీదైన సాఫ్ట్ డ్రింక్స్ కంటే స్వచ్ఛమైన చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు లేదా కమ్మని మజ్జిగకు జనం ప్రాధాన్యత ఇస్తారు. రద్దీగా ఉండే సెంటర్లలో ఒక చిన్న తోపుడు బండి లేదా స్టాల్ ఏర్పాటు చేస్తే అతి తక్కువ కాలంలోనే పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది.

ఐస్ క్రీమ్, కుల్ఫీ పార్లర్:

పిల్లల నుండి పెద్దల వరకు వేసవిలో అందరూ ఇష్టపడేది ఐస్ క్రీమ్. ప్రముఖ బ్రాండ్ల డీలర్‌షిప్ తీసుకోవచ్చు లేదా మీరే సొంతంగా ఇంట్లో తయారు చేసిన ‘కుల్ఫీ’ ఐస్ క్రీములను అమ్మవచ్చు. దీనికి పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ.

మట్టి కుండల వ్యాపారం:

నేటి కాలంలో ఫ్రిజ్ నీళ్ల కంటే మట్టి కుండలో చల్లబడిన నీళ్లకే డిమాండ్ పెరుగుతోంది. రంగురంగుల డిజైన్లు ఉన్న కుండలు, మట్టి బాటిళ్లను హోల్‌సేల్‌గా తెచ్చి ప్రధాన రహదారుల పక్కన విక్రయిస్తే మంచి ఆదాయం లభిస్తుంది.
ఇండోర్ ప్లాంట్స్ క్రేజ్: స్నేక్ ప్లాంట్, అలోవెరా (కలబంద), మనీ ప్లాంట్ మరియు పీస్ లిల్లీ వంటి మొక్కలు గాలిని శుద్ధి చేయడమే కాకుండా గది ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. వీటికి వేసవిలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
వేసవి రక్షణ వస్తువులు :

ఎండ నుండి రక్షణ ఇచ్చే గొడుగులు, సన్ గ్లాసెస్, కాటన్ క్యాప్స్, స్కార్ఫ్‌లు మరియు కాటన్ దుస్తులకు వేసవిలో గిరాకీ బాగుంటుంది. వారాంతపు సంతల్లో లేదా కాలేజీల దగ్గర వీటిని విక్రయించడం సులభం.

కూలర్ రిపేర్, ఏసీ సర్వీసింగ్:

మీకు టెక్నికల్ పరిజ్ఞానం ఉంటే, వేసవిలో కూలర్లు ఏసీల సర్వీసింగ్‌కు ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవచ్చు. కొత్త కూలర్లు అమ్మడం కంటే, ఉన్న వాటిని రిపేర్ చేయడం ద్వారా సీజన్ మొత్తం బిజీగా ఉండవచ్చు.

ఏ వ్యాపారమైనా విజయవంతం కావాలంటే నాణ్యత, శుభ్రత చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆహార పదార్థాల వ్యాపారంలో పరిశుభ్రత పాటిస్తే కస్టమర్లు మళ్లీ మళ్లీ మీ దగ్గరికే వస్తారు. ఈ వేసవిని మీ ఆర్థిక ఎదుగుదలకు ఒక అవకాశంగా మార్చుకోండి.

వ్యాపారం ప్రారంభించే ముందు ఆ ప్రాంతంలో డిమాండ్ దేనికి ఉందో గమనించండి. పాఠశాలలు, ఆఫీసులు లేదా బస్టాండ్ల దగ్గర పానీయాల వ్యాపారం చేస్తే గిరాకీ ఎప్పుడూ తగ్గదు.

Follow Us