AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: బంగారం ధరలు తారుమారు.. ఒక్కసారిగా ఊహించని మార్పులు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరలు రాత్రికి రాత్రి మారిపోతున్నాయి. ఉదయం ఒకలా రేట్లు ఉంటుండగా.. మార్కెట్లు ప్రారంభం కాగానే తారుమారు అవుతున్నాయి. మంగళవారం గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. ఏకంగా రూ.వెయ్యి మేర పెరిగింది. దీంతో కొనుగోలు చేసేవారు షాక్‌కు గురవుతున్నారు. ఇఫ్పుడు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Venkatrao Lella
|

Updated on: Mar 31, 2026 | 11:40 AM

Share
బంగారం ధరలు ఒక్కసారిగా మారాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే గోల్డ్ రేట్లు ఎగబాకాయి. అంతర్జాతీయ పరిస్థితుల క్రమంలో పసిడి ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. యుద్దం ప్రారంభమైన దగ్గర నుంచి గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. దాదాపు గరిష్టం నుంచి రూ.30 వేలకుపైగా పడిపోయింది. అయితే డాలర్ పుంజుకోవడంతో ధరలు దిగొచ్చాయి. ఇప్పుడు మళ్లీ పెరుగుదల నమోదవుతోంది.

1 / 5
మంగళవారం హైదరాబాద్‌లో గంటల వ్యవధిలోనే బంగారం ధరలు తారుమారు అయ్యాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,49,290 వద్ద ఉంది. ఒక్కసారిగా రూ.వెయ్యి పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,36,850 వద్ద కొనసాగుతూ వస్తోంది. అటు విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయని చెప్పవచ్చు

2 / 5
ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,49,130 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,700 వద్ద ట్రేడవుతోంది. అటు బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,49,290 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర చూస్తే రూ.1,36,850 పలుకుతోంది.

3 / 5
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ.1,49,440 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.1030 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,37,000 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.950గా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సుమారుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

4 / 5
ఇక ఢిల్లీలో కేజీ వెండి రూ.2.50 లక్షలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ రూ.5 వేలు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో కూడా రూ.2.50 లక్షల వద్ద ఉంది. ఇక చెన్నై, బెంగళూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధరల్లో ఇటీవల భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతుూ వస్తోన్నాయి.

5 / 5
Follow Us