Jio Plans: రూ. 200లోపు జియో బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌.. అదిరిపోయే బెనిఫిట్స్‌.

ప్రముఖ టెలికం సంస్థ జియోకు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది వినియోగదారులను సంపాదించుకొని అరుదైన రికార్డును సొంతం చేసుకుందీ సంస్థ. తక్కువ ధరకే ఇంటర్నెట్‌, అన్‌లిమిటెడ్‌ కాలింగ్ ఆఫర్లను అందించి. ప్రత్యర్థి కంపెనీలకు పోటీనిచ్చింది. మరీ ముఖ్యంగా...

Jio Plans: రూ. 200లోపు జియో బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌.. అదిరిపోయే బెనిఫిట్స్‌.
Jio Recharge Plan

Updated on: May 27, 2024 | 11:34 PM

ప్రముఖ టెలికం సంస్థ జియోకు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది వినియోగదారులను సంపాదించుకొని అరుదైన రికార్డును సొంతం చేసుకుందీ సంస్థ. తక్కువ ధరకే ఇంటర్నెట్‌, అన్‌లిమిటెడ్‌ కాలింగ్ ఆఫర్లను అందించి. ప్రత్యర్థి కంపెనీలకు పోటీనిచ్చింది. మరీ ముఖ్యంగా రూ. 200లోపు పలు ఆకర్షణీయమైన రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందిస్తున్నారు. ఇంతకీ రూ. 200 లోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఏంటి.? వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

జియో రూ. 149 ప్లాన్‌..

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌లో ఇదీ ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 20 రోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో రోజుకు 1 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందుతారు.

జియో రూ.179 ప్లాన్..

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 24 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో రోజుకు 1 జీబీ డేటా లభిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌ సదుపాయం పొందొచ్చు. రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు.

జియో రూ. 199 ప్లాన్‌..

23 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ రీఛార్జ్‌ ప్లాన్‌తో రోజుకు 1.5 జీబీ డేటా పొందొచ్చు. అలాగే రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు.

జియో రూ. 152 ప్లాన్‌..

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో రోజుకు 500 ఎంబీ డేటా పొందుతారు. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందొచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..