Business Idea: బిందాస్‌గా డబ్బులు సంపాదించాలా.? బెస్ట్‌ బిజినెస్ ఐడియా..

|

Sep 15, 2024 | 4:30 PM

ఒక రకంగా చెప్పాలంటే చదివిన చదువుతో సంబంధం లేకుండా వ్యాపారం చేస్తూ లక్షల్లో ఆర్జిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పటికీ నష్టాలు వస్తాయన్న భయంతో చాలా మంది వ్యాపారం చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. అయితే మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా, అధునాతన పద్ధతులను పాటిస్తే నష్టమనే మాటే లేకుండా...

Business Idea: బిందాస్‌గా డబ్బులు సంపాదించాలా.? బెస్ట్‌ బిజినెస్ ఐడియా..
Business Idea
Follow us on

మంచి ఉద్యోగం చేయాలి, ఆ తర్వాత నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. ఆ తర్వాత ఒక మంచి వ్యాపారాన్ని ప్రారంభించి మన కాళ్లపై మనం నిలబడాలి. చాలా మందిలో ఉండే ఆలోచనే ఇది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకప్పటిలా ఉద్యోగం చేశాక, వ్యాపారం చేద్దామనుకునే వారితో పోల్చితే చదువు పూర్తికాగానే వ్యాపారం చేయాలనే వారి ఆలోచన పెరుగుతోంది.

ఒక రకంగా చెప్పాలంటే చదివిన చదువుతో సంబంధం లేకుండా వ్యాపారం చేస్తూ లక్షల్లో ఆర్జిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పటికీ నష్టాలు వస్తాయన్న భయంతో చాలా మంది వ్యాపారం చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. అయితే మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా, అధునాతన పద్ధతులను పాటిస్తే నష్టమనే మాటే లేకుండా ఎంచక్కా లాభాలు ఆర్జించవచ్చు. అలాంటి ఓ బెస్ట్‌ బిజినెస్ ఐడియాల్లో నిమ్మసాగు ఒకటి. కాలంతో సంబంధం లేకుండా నిమ్మకాయలను డిమాండ్ ఉంటుంది. ఇలాంటి వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఊహకందని లాభాలను ఆర్జించవచ్చు.

ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో నిమ్మకాయ ఏకంగా రూ. 5 పలుకుతోంది. ఇలాంటి సాగను పండిస్తే కళ్లు చెదిరే లాభాలు ఆర్జించవచ్చని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిమ్మసాగు చేయాలంటే ముందుగా మీకు కొంత స్థలం ఉండాలి. ఇతర పంటలతో పోల్చితే నిమ్మసాగుకు నీరు చాలా తక్కువ అవసరపడుతుంది. సుమారు ఎకరం భూమిలో 100 చెట్లను నాటొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో నిమ్మ మొక్క ధర రూ. 30గా ఉంది. మార్కెట్లో ఎన్నో నాణ్యమైన నిమ్మమొక్కలు అందుబాటులో ఉన్నాయి.

అయితే నిమ్మ మొక్కలు నాటిన వెంటనే పంట అందుబాటులోకి రాదు. కనీసం మూడేళ్లు ఎదురు చూడాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత ఇక నిరంతరం దిగుబడి వస్తూనే ఉంటుంది. దిగుబడి విషయానికొస్తే చెట్టు సాంధ్రతపై ఆధారపడి ఉంటుంది. ఇది నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. లాభాల విషయానికొస్తే ఏడాదిలో సుమారు రెండు నుంచి మూడుసార్లు కోతకు వస్తాయి. నిమ్మ చెట్టు విస్తీరణం ఆధారంగా ఏడాదికి ఒక్క చెట్టు సుమారు 500 కిలోల నిమ్మకాయల దిగుబడి వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..