Bank Holidays: వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్… ఎప్పుడెప్పుడంటే..?

Updated on: Jun 20, 2026 | 8:05 AM

బ్యాంకింగ్ ఖాతాదారులకు అలర్ట్. వచ్చే వారంలో బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. పండుగలు, సాధారణ సెలవుల కారణంగా బంద్ కానున్నాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వచ్చే వారంలో ఏయే రోజుల బ్యాంకులు మూతపడతాయనేది చూద్దాం.

1 / 5
వచ్చే వారంలో బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. జూన్ 22 నుండి జూన్ 25 వరకు యథావిథిగా నడవనున్నాయి. అయితే జూన్ 26 నుండి జూన్ 28 వరకు వరుసగా మూడు రోజుల పాటు బంద్ కానున్నాయి.  భారతదేశంలోని అన్ని బ్యాంకులు జూన్ 22, జూన్ 23, జూన్ 24న జూన్ 25 తేదీలలో యధావిధిగా పనిచేస్తాయి. జూన్ 26న మొహర్రం చివరి రోజు కారణంగా చాలా నగరాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.

2 / 5
అగర్తలా, ఐజ్వాల్, బేలాపూర్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్, విజయవాడ వంటి నగరాల్లో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. అయతే అహ్మదాబాద్, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, గౌహతి, గాంగ్‌టక్, ఇంఫాల్, ఇటానగర్, జైపూర్, కొచ్చి, కోహిమా, పనాజీ, షిల్లాంగ్, సిమ్లా, తిరువనంతపురం వంటి అనేక ఇతర నగరాల్లో కూడా బ్యాంకులు తెరవబడతాయి.

3 / 5
జూన్ 27న నాలుగవ శనివారం రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక 28వ తేదీన ఆదివారం కావడంతో బ్యాంకులు బంద్ అవుతాయి. మొత్తం వచ్చే వారంలో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనుండటంతో ఖాతాదారులకు ఏమైనా బ్రాంచ్ బ్రాచులతో పని ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకుని పూర్తి చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశముంది.

4 / 5
జాతీయ సెలవులు, రాష్ట్ర స్థాయి సెలవులు, పండుగలను బట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు సెలవులను నిర్ణయిస్తుంది. బ్యాంకు సెలవులు కొన్నిసార్లు సాధారణ ప్రభుత్వ సెలవులతో ఏకీభవిస్తాయి. కానీ అవి నగరం నుండి నగరానికి మారుతూ ఉంటాయి. ఒక్కొ ప్రాంతంలో ఒక్కోలా సెలవులు ఉంటాయి. దీంతో ఖాతాదారులు బ్యాంక్‌కు వెళ్లేముందు ఒకసారి చెక్ చేసుకుని వెళ్లడం మంచిది.

5 / 5
ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ, సహకార, ప్రాంతీయ గ్రామీణ, స్థానిక ప్రాంత బ్యాంకులతో సహా అన్ని షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ బ్యాంకులు రెండవ, నాల్గవ శనివారాల్లో అందుబాటులో ఉండవు. ఇది అన్ని బ్యాంకులకు వర్తిస్తుంది.

Follow Us